Marriage : అల్లుడిని సాక్షాత్ విష్ణు స్వరూపుడు గా భావించి కాళ్ళు కడిగి… అమ్మాయిని లక్ష్మి స్వరూపం గా భావించి బుట్టలో తీసుకుని వచ్చి కన్యాదానం చేస్తారు.అల్లుడి పాదాలు కడిగి కన్యాదానం చేసేటప్పుడు కన్యను ఇచ్చేసా ..పుచ్చేసుకో అన్నట్టుగా దానం చేయడు కన్యాదాత. వరుడు దగ్గర నుండి కొన్ని ప్రమాణాలు తీసుకుని మరీ ఇస్తాడు. ఇన్ని సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్న గారాలపట్టి, తన ఇంటి మహారాణి ని కన్యాదాత సులువుగా వరుడి చేతిలో పెట్టకుండా కొన్ని ప్రమాణాలు చేయమంటాడు.
1. నీవు ధర్మమునందు ఈమెను అతిక్రమించకుండా ఉండాలి అని అడిగితే, వరుడు దానికి ఒప్పుకుని ధర్మమునందు ఈమెను అతిక్రమించనని
ప్రమాణం చేస్తాడు.
2. అర్ధము నందు నీవు ఈమెను అతిక్రమించకూడదు. నీవు ఇప్పటి వరకు సంపాదించిన దానికి , ఇక ముందు సంపాదించ బోయె దానికి ఈవిడ సర్వాది కారిణి అని ఒప్పుకుంటావా? అని అడిగితే దానికి కూడా వరుడు తన అంగీకారం తెలుపుతాడు.
3. నీ మనసులో కామం కలిగితే నీకు మా అమ్మాయి మాత్రం గుర్తుకు రావాలి. నా కూతురి ద్వారా మాత్రమే నీవు సంతానాన్ని పొందాలి. ఆ అర్హత ఇంకొకరికి ఇవ్వడానికి వీలులేదు అని అనగానే, వరుడు దానికి అంగీకారం తెలియచేసాడు.
ఇప్పుడు మహాద్భుతమైన కన్యాదానం ఘట్టం మొదలవుతుంది. విష్ణు స్వరూపం లో ఉన్న వరుడు ఎదురుపడితే, ఆయన కు ఆతిధ్యం అర్ఘ్యం, పాద్యం ఇవ్వాలి కదా!. అందుకే ముందు కన్యాదాత, వరుడు వివాహ వేదికకు వచ్చే లోపుగా ఒక ఆసనం ఏర్పాటు
చెయ్యాలి. అది కూడా ఒక దర్భాసనం అయి ఉండాలి. మరి విష్ణుమూర్తి వచ్చి ఎదురుగా నుంచుంటే ఉచితాసనం వేసి గౌరవించాలి కదా.. దర్భాసనం మించిన ఉచితాసనం ఇంకా ఏముంటుంది. కాబట్టి కన్యాదాత దానిని తప్పక ఏర్పాటు చేయాలి.
కాళ్ళు కడిగే సమయం లో ముందుగా కుడికాలుని పళ్లెం లో పెడితే తనకు కాబోయే అత్తగారు మరచెంబు తో సన్నటి ధారగా నీటిని అల్లుడి పాదాల మీద పోస్తుంటే, మామగారు చాలా జాగ్రత్తగా రెండు చేతులతో ఆ పాదాలు కడుగుతాడు. అలాగే, ఆ తరువాత ఎడమ పాదాన్ని పళ్లెం లో ఉంచాలి. ఆ పాదాన్ని కూడా మామగారు అంతే శ్రద్దగా కడుగుతారు.