మీ భాగస్వామి దగ్గర ఇలా ఉంటే ఇకస్వర్గమే!!

భార్యభర్తల బంధం దృడంగా ఉండాలంటే ప్రేమగా ఉండడం తో పాటు స్నేహం చేయడం కూడా  తెలియాలి. తమ జీవిత భాగస్వామితో స్నేహంగా ఉంటూ అరమరికలు లేకుండా వారితో అన్ని విషయాలు చర్చించడం వలన సంసార జీవితం సాఫిగా సాగిపోతుంది.

మీ భాగస్వామి దగ్గర ఇలా ఉంటే ఇకస్వర్గమే!!

పుట్టినరోజులు, పెళ్లి రోజు ఇలా ఏ సందర్భం అయినా  కలిసి జరుపుకోవడం చాలా చాలా ప్రధానం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి విషయాలను మరిచిపో కూడదు. భార్య భర్తలు  గొడవ జరిగినప్పుడు వాదించుకోవడం మాములే అయితే మెసేజెస్‌తో ఆ వాదన కు దిగ కూడదు. దీని వల్ల దూరం పెరిగి పోతుంది.మాట్లాడుకుని మాత్రమే మీ సమస్య పరిష్కరించుకోవాలి కానీ  మెస్సేజుల తో మాత్రం కాదని గుర్తు పెట్టుకోవాలి.

ప్రస్తుతమున్న సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతిఒక్కరికీ ఫ్రెండ్స్ ఉంటున్నారు.  తమకున్న స్నేహితుల గురించి ఖచ్చితంగా జీవిత  భాగస్వామికి తెలియడం చాలా అవసరం .ప్రస్తుత కాలం లో  భార్య, భర్త జాబ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో కొన్ని పనులు భార్యకో, భర్తకో  మాత్రమే సంబంధించినవి అని వదలకుండా ఇద్దరూ కలిసి పనులు చేసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఒకరి పైనే పని భారం పడకుండా ఉండడం తో పాటు ఒకరి తో ఒకరు కలిసి సమయం గడిపినట్లుగా కూడా అవుతుంది.

ఈ నాటి తీరిక లేని రోజుల్లో శృంగారాన్ని కూడా దంపతులు అనుభవించలేక పోతున్నారు. ఐతే కొన్ని కొన్ని పరిశోధనల్లోతెలిసిన విషయమేంటంటే, శృంగారం సరిగా అనుభవించక పోవడం దంపతులు విడిపోవడానికి ముఖ్యకారణం అవుతుంది. ఈ విషయం లో తమ భాగస్వామి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోకుండా తాము మాత్రమే సంతృప్తి పొందడంలాంటివి చేయకుండా భాగస్వామిని సంతృప్తి పరిచేలా ఉంటే అది మీ బంధానికి మరింత ఆహ్లాదం గా చేస్తుంది.

తమ భాగస్వామి అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరు కుంటారు. కాబట్టి అలంకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో  పాటు అందం గా కనిపించేందుకు ప్రయత్నించాలి.