చలికాలంలో ఇవి తప్పకుండా తీసుకోవాలి

వేసవి కాలంలో తీసుకొనే ఆహారం శరీరానికి కొంత వేడిని కలిగించేవిగా ఉండాలి. చలిని తట్టుకుని ఉండేందుకు మరియు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మంచి ఆహారాన్ని తీసుకోవాలి. వేసవిలో చలి నుంచి మనలిని మనం కాపాడుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి.

చలికాలంలో ఇవి తప్పకుండా తీసుకోవాలి

వింటర్ లో వెచ్చదనం కోసం ప్రతి రోజూ కొన్ని ఆహార పదార్ధాలని వింటర్ డైయట్ లిస్ట్ లో చేర్చుకుని ఖచ్చితంగా వాటిని రోజూ తీసుకోవాలి. ఇలా రోజూ తీసుకోవడం వల్ల చలి నుండి మరియు చలికాలంలో వచ్చే వ్యాధుల నుండి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. చలి కాలంలో తీసుకోవాలిసిన ఆహరం ఏమిటో తెలుసుకుందాం.

1. అందరూ ఇష్టంగా తినే పల్లీ పట్టి.. పల్లీలతో చేసే ఈ ఆహారం శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. రోజూ పల్లీలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా, శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి పల్లీల బదులు నువ్వులతో చేసినవి కూడా తీసుకోవచ్చు..

2. మెంతికూర మరియు మునగాకు…ఈ రెండిటిని తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. మీకు చర్మం పొడిబారే సమస్య ఉంటే ఆకుకూరలు తినడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

3. శీతాకాలంలో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

4. ఉల్లిపాయను తీసుకోవడం. యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి గుణాలు ఉల్లిపాయలలో అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని శీతాకాలంలో తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

5. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండే నల్లమిరియాలను చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది.  ఉష్ణోగ్రతతో పాటు జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది.