అస్సలు సంతోషం ఎక్కడ దాగి ఉందో తెలుసా?తెల్లవారు ఝామున నిద్రలేవడం లో అని ఎంతమందికి తెలుసు… కావాలంటే మీకు వీలుంటుంది అంటే మరి అర్ధరాత్రి వరకు కాలయాపన చేయకుండా త్వరగా నిద్రపోయి పొద్దున్నే లేచి పనులు చేసుకుని చూడండి మీకు ఎలా అనిపిస్తుందో.. త్వరగా నిద్రలేవకపోతే పనులు కాస్తాఆలస్యం అవుతాయి. అప్పుడు ఆఫీస్ కి వెళ్లడం కూడా ఆలస్యం, బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యం.. ఇలా అన్నిటికి కంగారు పడిపోయి ఒత్తిడిని పెంచుకోవడం ఎందుకు?
అలా కాకుండా అనుకున్న టైమ్‌కి ముందే లేచి చూడండి.. దీనివల్ల పనులు సక్రంగా జరుగుతాయి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి… నిద్ర కొంచెం తగ్గినా పెద్దగా నష్టం ఉండదు కానీ ఆలస్యం గా లేస్తే మాత్రం సమయానికి పనులు చేసుకోలేక చాల నష్టాలు,కష్టాలు తప్పవు.చాలామంది నిద్రలేవగానే.. ఫేస్బుక్,వాట్సప్, సోషల్ మీడియాలో ఏం మెసెజెస్ వచ్చాయో అని చూస్తుంటారు.
కానీ ఇలా చేయకుండా లేవగానే.. ఓ జోక్ చదవడం కానీ, చూడడం కానీ చేసి మనసారా నవ్వుకోండి. లేచినప్పట్నుంచీ మనకి కనిపించిన వారందరికీ విష్ చేయడంవలన ఎదుటివారికే కాక.. మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఏదైనా మ్యూజిక్ కాస్తా తక్కువ వాల్యూమ్‌తో వినండి.. దీనివల్ల చాల ప్రశాంతం గా అనిపిస్తుంది.
లేవగానే టీ, కాఫీ కాకుండా గోరువెచ్చని, నిమ్మకాయ నీళ్లు తాగితే శరీరం లో ఉండే వ్యర్థాలు బయటికి పోతాయి.
పండ్లని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీలున్నప్పుడల్లా కాస్తా తీసుకుంటూ ఉండడం. దీనివల్ల శరీరానికి, మనసుకు ఆనందంగా అనిపిస్తుంది.
నిద్ర అనేది చాలా ముఖ్యం. రోజూ తప్పనిసరిగా 8గంటల నిద్ర ఉండాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలా నిద్రపోవాలంటే నిద్రకు కనీసం ఓ గంటన్నర ముందే భోజనం పూర్తి చేసేసి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని పక్కనపెట్టి పడుకోవడం అలవాటు చేసుకోవాలి.
మొదటిలో కొంచెం కష్టం గా ఉన్న అలవాటు చేసుకుంటే మాత్రం చాల సౌకర్యంగా ఉంటుంది.