ప్రస్తుత ఆధునికజీవనం లో భార్యాభర్త మధ్య అర్థం చేసుకునేతత్వం బాగా తగ్గిపోయింది. భార్య భర్తల మధ్య బంధం బలంగా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం..మీరు చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఎలాంటి విషయాలలో ఎక్కువగా విమర్శలు ఎదురుకునేవాళ్ళో అవి మీకు నేర్పిన అనుభవాలు ఏమిటో గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. అప్పుడు మీరు చేసిన తప్పిదాలు ఇప్పుడు మీ మధ్య జరగకుండా జాగ్రత్త పడండి.
అప్పుడప్పుడు మీ భాగస్వామి కి నచ్చిన వంటలను మీ చేత్తో మీరే చేసి వారికి దగ్గరుండి తినిపించి దాని రుచి వారికి నచ్చిందో లేదో అడగండి.ఒకవేళ వాళ్ళు ఏదైనా సలహాలు ఇస్తే సంతోషం గా స్వీకరించండి.
సమయం దొరికినప్పుడు ఇద్దరు కలిసి టీవీ చూస్తుండడం కాకుండా సరదాగా ఉండే ఆటలు ఆడండి. ఆట వలన మనస్సులు ఉత్సహం గా ఉంటాయి.
మీ భాగస్వామి మీకు నచ్చిన పని చేసినప్పుడు లేదా అందంగా రెడీ అయినప్పుడు మెచ్చుకోవడం మరిచిపోవద్దు . అలా పొగుడుకోవడం వల్ల మీ పార్ట్నర్ కు మీ విషయం లో తెలియని, గర్వం సంతోషంకలుగుతుంది .
మీ ఇద్దరూ మాత్రమే గడిపేందుకు ఎక్కువ సమయం దొరకనప్పుడు బాధపడకుండా.. దొరికినకొద్దీ టైం లోనే ఎక్కువ ప్రేమను పంచుకోండి.. ఆ కాసేపు అన్నీ విషయాలు పక్కన పెట్టేసి సంతోషంగా గడపండి.
ఒక బంధం నిలబడాలంటే నమ్మకం, ప్రేమ, స్నేహం వీటిలో ఏ ఒక్కటి తక్కువయినా బంధం కలకాలం నిలబడడం కష్టమని గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఉంటేనే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది.
ఎప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటు అడుగడుగునా తోడుగా ఉంటూ కలిసి ఉంటేనే ఆనందం పొంగుతుంది. కోపాలు, గొడవలు , చాల సహజం గా వచ్చేవే..ఒక తల్లి కడుపున పుట్టిన తోబుట్టువులతో కూడా మనం అప్పుడు అప్పుడు గొడవలు పడిన సందర్భాలు ఉంటాయి.. ఇక్కడ కూడా అంతే కాబట్టి వాటినిమరిచిపోయి తిరిగి దగ్గరఅయితేనే దాంపత్యానికి అర్ధం ఉంటుంది.