ఆచార్య లో మెగాస్టార్ ఇంట్రో సాంగ్ కోసం అన్ని కోట్లా… అమ్మో కొరటాలా అంటున్నారు ..?

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రెజీనా స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి చిందులేసింది. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీటయింది. కాగా ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ మూవీస్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి – రామ్ చరణ్ కలిసి నిర్మిస్తున్నారు. అయితే కరోనా కారణంగా నిలిచిపోయిన ‘ఆచార్య‘ షూటింగ్ ఇటీవలే తిరిగి మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

Chiranjeevi speaks about Charan's role in Acharya; his remakes - tollywood

రీసెంట్ గా మెగాస్టార్ కూడా ఆచార్య సినిమా సెట్ లో అడుగుపెట్టారు. మెగాస్టార్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు కొరటాల. కాగా తాజా సమాచారం ప్రకారం ఇటీవలే మెగాస్టార్ ఇంట్రో సాంగ్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని కోకాపేట లో 16 ఎకరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. దీని కోసం సుమారు 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఈ సెట్ లోనే మెగాస్టార్ ఇంట్రో సాంగ్ ని కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది.

అయితే శరవేగంగా జరుగుతున్న ఈ షెడ్యూల్ లో చిరంజీవి పాల్గొనే కీలకమైన సన్నివేశాలతో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. లాక్ డౌన్ కి ముందే ఒక సాంగ్ 40 శాతం చిత్రీకరణ కంప్లీట్ కాగా ఇప్పుడు దాదాపు మెజారిటీ టాకీ పార్ట్ త్వరలో కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ‘ఆచార్య’ సినిమా బడ్జెట్ దాదాపు 120 కోట్లు వరకు కేటాయించినట్టు తెలుస్తోంది.

ఇక ‘లాక్ డౌన్‘ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించనున్నాడు. కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా 2021 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కంప్లీట్ చేసి మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం తెలుగు రీమేక్ లో నటించబోతున్నారు మెగాస్టార్.