భవిష్యత్ అవసరాల కోసం.. !ఈ స్కీం

Share

ఈ రోజుల్లో అందరూ ఆర్దిక ప్రణాళికలు వేసుకుంటున్నారు.   భవిష్యత్ లో వారి అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. జీవితంలో భద్రత ను ఏర్పాటు చేసుకుంటున్నారు. తక్కువ పెట్టబడులతో ఎక్కువ రాబడి ఉండే విధంగా ప్తాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి వారు భవిష్యత్ కాలానికి తగినట్లు ప్రణాళికలు వేసుకుంటారు.

వయసు మళ్ళిన తరువాత అలా దాచు కున్న నగదు వారి అవసరాలకు ఉపయోగపడేలా..ముందు నుండే ప్రణాళికబద్దంగా నడుచుకుంటారు.  ఏ స్కీంలలో నగదు పెట్టుబడి పెడితే భవిష్యత్ లో ఎక్కువ ఆదాయం పొందవచ్చు అనేది ఆలోచిస్తారు.  దానికి అనుగుణంగా అవసరమైతే నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. వీరి కోసమే కేంద్ర ప్రభుత్వం చే స్థాపించబడినది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. దీని లో ఒక స్కీం ఉంది. ఈ స్కీం ద్వారా ప్రతి నెలా తక్కవ మొత్తంలో నగదు పెట్టుబడి పెట్టి, భవిష్యత్ లో ఎక్కువ మొత్తంలో లాభం అర్జించవచ్చు. కేంద్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ అందరికి అందుబాటులో ఉంచింది. ఇందులో ఎకౌంట్ హోల్డర్ ప్రతి నెల కొంత నగదును ఇన్వెస్ట్ చేయాలి. ఈ పథకం యొక్క కాల పరిమితి 15 సంవత్సరాలు. మరో ఐదేళ్ళ పాటు ఈ స్కీం యొక్క మెచ్యూరిటీ సమయాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉంది. పెట్టిన పెట్టుబడికి భద్రత ఉంటుంది.  పన్ను మినహాయింపు కూడా వర్తిస్తుంది.

ఈ స్కీంలొ దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు  500 రూపాయలతో  ఏదైనా బ్యాంకుకు కాని పోస్టాఫీసుకు కాని వెళ్లి అకౌంట్ తెరవచ్చు. ప్రైవేటు బ్యాంకులలో కూడా ఈ సౌకర్యం ఉంటుంది. కాని పిపిఎఫ్ లో ఎకౌంట్ కావాలి అంటే బ్యాంకులో ఎకౌంట్ కలిగి ఉండాలి. దీనిలో నెల నెల కాని, సంవత్సరానికి ఒక సారి కాని నగదు కట్టవచ్చు. ఐదు సంవత్సరాలు దాటిన తరువాత మనం కట్టిన నగదు మీద లోన్ పొందే అవకాశం కూడా ఉంటుంది. రోజుకు రెండు వందల రూపాయల చొప్పున నెలకు ఒకే సారి పిఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేశాము అనుకోండి,  ఇలా చేయడం వలన 20 సంవత్సరాల కాలానికి 32 లక్షలు రూపాయలు మెచ్యురిటి పొందవచ్చు. మనం కట్టే ప్రతి రూపాయికి వంద శాతం భద్రత ఉంటుంది.

 

 

 

 

 

 

 


Share

Related posts

BREAKING: ఐపిఎల్ కి కరోనా టెన్షన్.. ఒకరికి వచ్చేసింది ..!

amrutha

ఈ లక్షణాలు మీలో ఉంటే వెంటనే ఈ జాగ్రత్త తీసుకోండి!

Teja

Voter ID: సింపుల్ గా ఓటర్ కార్డు లో అడ్రస్ మార్చుకోండిలా..!!

bharani jella