YS Jagan: మధ్యతరగతి ప్రజల కోసం జగన్ ప్రభుత్వం సరికొత్త ప్లాన్..!!

Share

YS Jagan: ప్రస్తుత ప్రపంచంలో సొంతింటి కల అనేది పేదవాడికి అదేరీతిలో మధ్యతరగతి ప్రజలకు కలగానే మిగిలిపోతున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో వైఎస్ జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ప్రజలకు కచ్చితంగా.. సొంతింటి విషయంలో అధికారంలోకి వస్తే గత ప్రభుత్వాల కంటే ఎక్కువ మేలు చేసేలా వ్యవహరిస్తామని మాట ఇవ్వటం జరిగింది. ప్రజా సంకల్ప పాదయాత్రలో అదేరీతిలో 2019 ఎన్నికల ప్రచారంలో కూడా వైఎస్ జగన్ చాలాచోట్ల ఈ హామీని ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలను క్రమక్రమంగా నెరవేర్చుకుంటూ…దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన లోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 90% హామీలను నెరవేర్చిన సీఎంగా జగన్ రికార్డు సృష్టించారు.

Andhra Pradesh CM to lay stone for housing scheme today | Amaravati News -  Times of India

ముఖ్యంగా కరోనా లాంటి కష్ట కాలంలో ప్రజలు ఉద్యోగాలకు వెళ్ళలేక ఇంటిలోనే ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొన్న క్రమంలో ప్రజలకు.. ప్రభుత్వ పథకాల రూపంలో వైఎస్ జగన్… ఏపీలో అన్ని కుటుంబాలను ఆదుకుంటు వస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సంక్షేమ రాజ్యాన్ని.. సకాలంలో అమలు చేస్తూ.. ఏపీలో సకుటుంబంగా.. ప్రజలు ఆనందించేలా ఎక్కడ చేయి చాపే పరిస్థితి రాకుండా.. చూసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పటికే రాష్ట్రంలో నిరుపేద సొంతింటి కల సాకారం చేయడానికి జగన్ ప్రభుత్వం ముందడుగు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న జగన్ ఆ దిశగా ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇస్తూ వస్తున్నారు.

టార్గెట్ 18 నెలల్లో 2 లక్షలు ఇళ్ళు…:-

ఈ క్రమంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీ ఇల్లు, టిడ్కో ఇల్లు, ఏం.ఐ.జి లే అవుట్లు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల కార్యక్రమాలపై ఇటీవల మంత్రులు ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలు గురించి జగన్ కి లెక్కలు తెలియజేశారు. ఇప్పటికే ఫేస్ వన్ లో భాగంగా 80 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి అయినట్లు స్పష్టం చేశారు. రానున్న 18 నెలల్లో మిగతా ఇళ్ల నిర్మాణం మొత్తం పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇటువంటి తరుణంలో తాజాగా మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కోసం జగన్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరిట నగరాలలో అదేరీతిలో పట్టణాలలో ప్రజలకు సరసమైన ధరలకే ఫ్లాట్లు ఇచ్చేలా సరికొత్త ప్లాన్ వేయడం జరిగింది.

మిడిల్ క్లాస్ ఫామిలీస్ కి పట్టణాలలో ఫ్లాట్స్..:-

విషయంలోకి వెళితే ఇప్పటివరకు 3.94 లక్షల దరఖాస్తులు పట్టణ ప్రాంతాల నుండి రావడం జరిగింది. దీంతో వచ్చిన దరఖాస్తులను నేటికీ న్యాయం చేసేలా వచ్చే దసరా నాటికి భూములను గుర్తించి ప్లాట్లు అందించడానికి జగన్ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ క్రమంలో లో జగన్ అన్న కాలనీలో నివసించే ప్రజలకు.. ఇంటర్నెట్ సదుపాయం తో పాటు మౌలిక సదుపాయాలు కల్పించేలా అధికారులు ప్లాన్ చేయాలని ఇప్పటికే జగన్ ఆదేశించడం జరిగిందట. ఈ పరిణామంతో రానున్న దసరా లోపు పట్టణ ప్రాంతాలలో ఉండే మధ్యతరగతి ప్రజల సొంతింటి కల కూడా తీర్చడానికి జగన్ ప్రభుత్వం అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.


Share

Related posts

బీజేపీ నుండి లంక దినకర్ సస్పెన్షన్

Special Bureau

Bigg boss 4: వచ్చే వీకెండ్ హోస్ట్ నాగార్జున కాదు.. ఎవరో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు?

Varun G

కీర్తి సురేష్ .. కాజల్ అగర్వాల్ ని కాదని తాప్సీ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ..!

GRK