మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హంగామా ఇప్పటినుండే మొదలైంది. చిరంజీవి తన పుట్టినరోజును ఆగష్టు 22న జరుపుకుంటారన్న విషయం తెల్సిందే. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం స్టార్ హీరోల పుట్టినరోజులకు కామన్ డిస్ప్లే పిక్చర్ కానీ కామన్ మోషన్ పోస్టర్ కానీ విడుదల చేయడం ఆనవాయితీ.
చిరంజీవి పుట్టినరోజు వేడుకకు కూడా కామన్ మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తున్నారు. ఇంతకీ ఎవరు విడుదల చేస్తున్నారు అనే సందేహం వచ్చింది కదా.. ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన 65 మంది సెలబ్రిటీలు చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ఇది భారతదేశ చలన చిత్ర పరిశ్రమలోనే తొలిసారి జరగబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు కూడా ఆగష్టు 22న తెలిసే అవకాశముంది.