Marriage: వెనుకున్నకారణం
అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి?దాని వెనుకున్నకారణం ఏమిటి అనేది తెలుసుకుపోవడం ప్రతి వ్యక్తికీ చాలా అవసరం..
ప్రతీ మనిషీ కి పుట్టుకతోనే మూడు ఋణాలు ఉంటాయి.. అవి 1. ఋషిఋణం 2. దేవఋణం 3. పితృఋణం ఇవి తీరడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం.
Marriage: యజ్ఞ యాగాది క్రతువులు
ఋషి ఋణం అంటే ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మచర్యం తో ఋషి ఋణంతీరుతుంది. అంటే బ్రహ్మచర్యంలో నిష్ఠగా వేదాధ్యయనం చేయాలి. దీనితో పాటు మన ఋషులు రచించిన అనేక పురాణాలు మొదలైన వాగ్మయాన్ని అధ్యయనం చేసి, అటు తర్వాత వచ్చే తరం వారికి వాటిని అందించి ఋషి ఋణం తీర్చుకోవాలి. దేవఋణం అంటే యజ్ఞ యాగాది క్రతువులు చేయడం తో పాటు చేయించడం ద్వారా ఈ ఋణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. యజ్ఞం అంటే త్యాగం అని అర్ధం. యజ్ఞాలు చేయడం వలన దేవతలు తృప్తి పడతారు. సకాలంలో వర్షాలు పడి… పాడిపంటలు వృద్ధి చెంది కరువు కాటకాలుఉండవు. మనకు నీరు, గాలి, వెలుతురు, ఆహారాన్నిఅందడానికి కారణం అయినవారికి రుణపడిఉంటాం అది తీరడానికి యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి.
వేదం చెపుతున్నది.
పితౄణం అంటే సత్సంతానాన్నికని ఈ ఋణాన్ని తీర్చుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు మన ప్రత్యక్ష దైవాలు, మనకు జన్మనిచ్చి పెంచి పోషించారు. వంశాన్ని విచ్చిన్నం కాకుండా కొనసాగించడం ద్వారా, పితృ దేవతలకు తర్పణాది క్రియలు చేయడం ద్వారా యోగ్యులైన సంతానాన్ని కనీ పితృ ఋణం తీర్చుకోవాలి. సంతానం కలగాలి అంటే కచ్చితం గా వివాహం చేసుకోవాలి. అప్పుడే సంతానం కలిగి పితృ ఋణం తీరుతుంది. వేదాధ్యయనం చేయడం , యజ్ఞం చేయడం, సంతానము కనడం అనేవి పుట్టిన ప్రతి మానవుడు తప్పని సరిగా చేయవలసిన విధులుగా వేదం చెపుతున్నది.