ఫోర్డ్ కార్లు భలే ఆఫర్లు..! మిడ్ నైట్ స్పెషల్స్ తెలుసుకోండి..!!

 

అమెరికన్ ఆటో దిగ్గజం ఫోర్డ్ ఇండియా, భారత మార్కెట్లో గడచిన కొద్ది సంవత్సరాలుగా ప్రతి ఏటా డిసెంబర్ నెలలో ‘మిడ్‌నైట్ సర్‌ప్రైజ్’ పేరిట షోరూమ్‌లను అర్థరాత్రి వరకు తెరచి ఉంచుతుంది.. కారును కొనుగోలు చేసిన వారికి ఆకర్షనీయమైన బహుమతులను, డిస్కౌంట్లను అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే..! ఈ ఏడాది కూడా ప్రారంభించింది..! ఈ క్యాంపైన్ ను డిసెంబర్ 4, 2020వ తేదీ నుండి డిసెంబర్ 6, 2020వ తేదీ వరకూ మాత్రమే ఉంటుంది..!

 

 

ఈ క్యాంపైన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఫోర్డ్ ఇండియా షోరూమ్‌లను ఉదయం 09:00 నుండి అర్ధరాత్రి వరకు తెరచి ఉంచుతారు. షోరూమ్ పనివేళలను పెంచడం ద్వారా రోజంతా బిజీగా ఉండే కస్టమర్లు రాత్రివేళల్లో తీరికగా షోరూమ్‌ను సందర్శించుకుని, కారు కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసుకుందు వీలుగా కంపెనీ ఈ క్యాంపైన్‌ను ప్రారంభించింది. కస్టమర్లు డయల్-ఎ-ఫోర్డ్ సర్వీస్ ‌ద్వారా 1800-419-3000 టోల్ ఫ్రీ ను ఉపయోగించుకోవచ్చు. ఇంకా బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్లోwww.booking.india.ford.com ఏదైనా ఫోర్డ్ వాహనాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఫోర్డ్ కార్లను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు డిజిటల్ స్క్రాచ్ కార్డు లభిస్తుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, ఎల్‌ఈడీ టీవీలు, ఎయిర్ ప్యూరిఫైయర్, బంగారు నాణేలు, రూ.25,000 వరకూ అష్షూర్డ్ గిఫ్ట్ కార్డులు ఉంటాయి. ఈ స్క్రాచ్ కార్డుతో పాటు, డిసెంబర్ 2020 నెలలోనే డెలివరీలు తీసుకునే వినియోగదారులు 5 లక్షల రూపాయల విలువైన లక్కీ డ్రా బహుమతులు పొందవచ్చు. ఈ మూడు రోజుల ప్రత్యేక అమ్మకాల ఆఫర్లతో ఫోర్డ్ ఇండియా ఈ ఏడాది ముగిసే లోపుగా తమ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్లాన్ చేసింది.

 

 

ఫోర్డ్ ఇండియా ఇటీవలే ‘సర్వీస్ ప్రైస్ కాలిక్యులేటర్’ అనే కొత్త ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను కూడా ప్రవేశపెట్టింది. దీని సాయంతో వినియోగదారులు వర్క్‌షాప్‌కు రాకుండానే వారి వాహనాల సర్వీస్ , స్పేర్ పార్ట్స్ అయ్యే ఖర్చును తెలుసుకోవచ్చు. ప్రస్తుతం భారత మార్కెట్లో ఫిగో, ఫ్రీస్టైల్, ఆస్పైర్, ఎకోస్పోర్ట్, ఎండీవర్, మస్తాంగ్ పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కారును భారత మార్కెట్లో విక్రయిస్తుంది. భారత మార్కెట్లో 2020 అమ్మకాల లక్ష్యాలను చేరుకునేందుకు ఫోర్డ్ ఇండియా దేశంలో మిడ్‌నైట్ సర్‌ప్రైజ్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఈ క్యాంపైన్ ప్రత్యేకించి నిత్యం బిజీగా ఉండే వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఫోర్డ్ కార్లు భలే ఆఫర్లు..! మిడ్ నైట్ స్పెషల్స్ తెలుసుకోండి..!!