Breaking: సీబీఐ మాజీ డైరెక్టర్ కె విజయ రామారావు మరణించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎల్లుండి హైదరాబాద్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్ లో విజయరామరావు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. సీబీఐ డైరెక్టర్ గా పదవీ విరమణ అయిన తర్వాత ఆయన టీడీపీలో చేరారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి పి జనార్థనరెడ్డి మీద విజయం సాధించారు.

చంద్రబాబు మంత్రివర్గంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2004 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి దానం నాగేందర్ చేతిలో ఓటమి పాలైయ్యారు. సీబీఐలో నిక్కచ్చిమైన అధికారిగా ఆయన పేరు పొందారు. కొన్నాళ్ల నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి ప్రకటించారు.
విజయరామారావు జన్మించింది వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో కాగా ఆయన ఇంటర్మీడియట్ వరకూ ఏపిలోని నెల్లూరులో చదువుకున్నారు. ఆ తర్వాత మద్రాస్ యూనివర్శిటీలో చేరి బీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత 1958 అక్టోబర్ లో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో అధ్యాపకులుగా ఉద్యోగంలో చేరారు. ఆ మురసటి సంవత్సరంలోనే సివిల్స్ అర్హత సాధించి..టైనింగ్ పూర్తి అయిన తర్వాత చిత్తూరు ఎఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డైరెక్టర్ గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢ చర్యం కేసు, ముంబై బాంబు పేలుళ్లు లాంటి ప్రముఖ కేసులను దర్యాప్తు చేశారు.
Breaking: ఈనాడు రామోజీకి ఏపి సర్కార్ బిగ్ షాక్ .. మార్గదర్శిలో నిబంధనల ఉల్లంఘనలపై సీఐడీ కేసు నమోదు