డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ టీ వెంకట్రామిరెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కెనరా బ్యాంక్, ఐడీబీఏ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఈడీ అదుపులోకి తీసుకుంది. వెంకట్రామిరెడ్డి తో సహా మరో ఇద్దరిని ఈడీ అరెస్టు చేసింది. వీరిని ఇవేళ కోర్టుకు హజరుపర్చిన అనంతరం రిమాండ్ కు తరలించనున్నారు. కాగా రూ.8వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో వెంకట్రామిరెడ్డిపై ఈడీ అభియోగుల మోపింది. పెద్ద మొత్తంలో రుణాలు మళ్లించారనే అరోపణలు ఉన్నాయి. రుణాలు ఎగవేసిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది. తీసుకున్న రుణాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఆరోపించింది.

సీబీఐ కేసుల ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోని విచారణ మొదలుపెట్టింది. గతంలో వెంకట్రామిరెడ్డికి చెందిన రూ3,300 కోట్లకుపైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా వెంకట్రామిరెడ్డిని ఇడీ అధికారులు విచారణకు పిలిపించారు. విచారించిన అనంతరం వెంకట్రామిరెడ్డితో పాటు మరో వ్యాపార వేత్త మణి అయ్యర్ ను హవాలా, మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది ఈడీ. ఒక పక్క ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుపుతుండగా, ఈడీ మరో వైపు అరెస్టులు చేయడం తెలంగాణలో హాట్ టాపిక్ అయ్యింది.
IT Raids: తెలంగాణలో మరో సారి ఐటీ దాడుల కలకలం .. బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసంలో..