టీడీపీలో ఒకప్పటి తోపు తురుము మంత్రి ! ఇప్పటి పరిస్థితి చూస్తే జాలేస్తోంది!!

Share

టిడిపిలో మంత్రిగా ఒక వెలుగు వెలిగిన ఆ మాజీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దుర్భరంగా ఉంది. ఉన్న ఊరు నుంచి తరిమి వేయబడి, ప్రస్తుతం ఉన్న ఊర్లో ఇమడలేక ఆ మాజీ రాజకీయంగా అష్టకష్టాలు పడుతున్నాడు.

 Former grove minister in TDP Looking at the current situation
Former grove minister in TDP Looking at the current situation


ఆయనే మాజీ ఎక్సైజ్ మంత్రి కేఎస్ జవహర్! పూర్వాశ్రమంలో టీచరైన జవహర్ రాజకీయాల్లో ప్రవేశించి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబునాయుడు ప్రభుత్వం లో మంత్రి కూడా అయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది! ఆ తర్వాత ఆయన కష్టాలు మొదలయ్యాయి!ఇందులో జ‌వ‌హ‌ర్ స్వయంకృతాప‌రాథం కొంత ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే క‌మ్మ సామాజిక వ‌ర్గం కోట‌రీ ఆయ‌న్ను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

మంత్రిగా ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. టిడిపి కూడా బలమైన వాయిస్ గా నిలిచారు. మాదిగ సామాజిక వర్గాన్ని టిడిపి వైపు జవహర్ తిప్పారు. ఇవన్నీ చంద్రబాబు లోకేష్ లకు తెలిసినప్పటికీ కొవ్వూరు లోని బలమైన కమ్మ సామాజిక వర్గం నేతల ఒత్తిడికి తలొగ్గి ఎన్నిక‌ల 2019 ఎన్నికలలో జ‌వ‌హ‌ర్‌ను ఆయ‌న ఇష్టానికి వ్యతిరేకంగా ఆయ‌న‌కు ప‌ట్టున్న కొవ్వూరును కాద‌ని కృష్ణా జిల్లా తిరువూరుకు పంపారు.అక్కడ ఆయన ఓడిపోయారు. కొవ్వూరులోవఎక్కడో పాయకరావుపేటకు చెందిన అనితను తీసుకొచ్చి నిలబడితే ఆమె పరాజయం చెందారు!ఓటమి అనంతరం ఆమె విశాఖపట్నం వెళ్లిపోయారు.

ఇప్పుడు కొవ్వూరు ఖాళీగా ఉండటంతో అక్కడికి వెళ్లిపోవాలని జవహర్ చూస్తున్నారు.తిరువూరులో మాజీ టిడిపి ఎమ్మెల్యే స్వామిదాసు నుంచి జవహర్ కి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ఈ నేపథ్యంలో జన్మభూమి వెళ్లిపోదామని జవహర్ చూస్తుంటే ఆయన్ని కొవ్వూరులో వ్యతిరేకించే కమ్మసామాజిక నేతలు రానీయడం లేదు. నిజానికి జవహర్ కొవ్వూరు వెళితే అక్కడ టిడిపి బలోపేతం కాగలదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ చంద్రబాబు లోకేష్లు తమ సామాజిక వర్గ నేతల గీతను దాటే పరిస్థితులు లేవు. మరి జవహర్ ఏమవ్వాలి ?ఆయన రాజకీయ భవితవ్యం ఏమిటి అన్నది కాలమే నిర్ణయించాలి!!


Share

Related posts

ఓమైగాడ్.. సుధీర్, రష్మీ జంటపై రాకింగ్ రాకేష్ షాకింగ్ కామెంట్స్

Varun G

మా ఆయన బంగారం అంటున్న వైయస్ భారతి రెడ్డి..??

sekhar

పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి వకీల్ సాబ్ టీజర్ కంటే ఈ న్యూస్ ఎక్కువ కిక్ ఇస్తుంది.

Naina