Telangana BJP: తెలంగాణ బీజేపీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. పార్టీలో చేరతారని భావించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తమ నిర్ణయాన్ని మార్చుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ బీజేపీలో చేరికల జోష్ తగ్గింది. కేసిఆర్ సర్కార్ పై దూకుడుగా వ్యవహరిస్తూ పాదయాత్ర ద్వారా పార్టీ లో జోష్ ను నింపి బలోపేతంకు కృషి చేస్తున్న కరీంనగర్ లోక్ సభ సభ్యుడు బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించి కిషన్ రెడ్డికి అప్పగించడంతో అది సీఎం కేసిఆర్ దెబ్బేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఈ పరిణామాల క్రమంలో పలువురు బీజేపీ సీనియర్ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ ఆ పార్టీకి బైబై చెప్పేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపించారు చంద్రశేఖర్. పార్టీలో పని చేసే వారికి ప్రోత్సాహం లేదంటూ కూడా ఆయన ఆరోపించారు. చంద్రశేఖర్ పార్టీ వీడకుండా ఉండేందుకు ఈటల రాజేందర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బీజేపీకి గుడ్ బై చెప్పిన చంద్రశేఖర్ .. కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరిగాయనీ, త్వరలోనే చంద్రశేఖర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారని ఆయన అనుచరులు అంటున్నారు.
గత కొంత కాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న చంద్రశేఖర్ .. 1985 నుండి 1999 వరకూ వరుసగా నాలుగు సార్లు టీడీపీ నుండి వికాబారాద్ అసెంబ్లీ నుండి గెలిచారు. 2001 లో టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో బాగంగా ఏర్పాటైన టీఆర్ఎస్ లో చేరారు. 2004లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ నుండి అయిదవ సారి ఎమ్మెల్యే గా గెలిచారు. వైఎస్ఆర్ కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008లో తెలంగాణ వ్యూహంలో బాగంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం ప్రసాద్ కుమార్ చేతిలో పరాజయం పాలైయ్యారు.
2009 లో జరిగిన ఎన్నికల్లో మరో సారి ఓటమి పాలైయ్యారు చంద్రశేఖర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి మరల ఓడిపోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2021 లో బీజేపీ లో చేరిన చంద్రశేఖర్ .. నేడు పార్టీని వీడారు.
అలిపిరి నడక మార్గం చిరుత ప్రమాదాలపై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ