సైకిల్ ఎక్కుతానన్న కిషోర్‌చంద్రదేవ్

అమరావతి, ఫిబ్రవరి 12: కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టిడిపిలో చేరికకు రంగం సిద్దం చేసుకున్నారు.

ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం కిషోర్ చంద్రదేవ్ భేటీ అయ్యారు.

చంద్రబాబుతో సమావేశం ముగిసిన తరువాత కిషోర్ చంద్రదేవ్ మీడియాతో మాట్లాడారు.

త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాననీ, చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసినట్లు చంద్రదేవ్ చెప్పారు.

రాష్ట్రంలో టిడిపి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తాననే విషయంపై భేటీలో చర్చకు రాలేదని చంద్రదేవ్ అన్నారు.