NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్టు..ఎందుకంటే..?

Prattipati Pullarao Son Arrest: టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్టు అయ్యారు. విజయవాడలోని మాచవరం పోలీసు స్టేషన్ లో శరత్ పై కేసు నమోదు అయ్యింది. ఏపీ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. నిధులు మళ్లించి పన్ను ఎగవేశారన్న అభియోగంపై శరత్ పాటు మొత్తం ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 420, 409, 467, 471, 471(ఏ), 120 బీ రెడ్ విత్ 34 సెక్షన్ లపై కేసు నమోదు అయ్యింది.

ఈ కేసులో పుల్లారావు కుమారుడితో పాటు, భార్య, బావమరిది మరో అయిదుగురు నిందితులుగా ఉన్నారు. అలెక్సా కార్పోరేషన్ ప్రైవేటు లిమిటెడ్ లో పన్ను ఎగవేశారని ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్నారు. పుల్లారావు కుమారుడు శరత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.

కుమారుడు శరత్ అరెస్టుపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఓటమి భయంతో జగన్ రెడ్డి రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాజకీయ క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్ధులపై వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. తన కుమారుడు కంపెనీలో డైరెక్టర్ గా కూడా లేడనీ, కనీసం షేర్ హోల్డర్ కూడా కాదని అలాంటి వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. చిలకలూరిపేటలో మంత్రి రజిని వైఫల్యాలే వారి ఓటమికి బాటలు వేశాయన్నారు.

తాము నిరంతంరం ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేసుకున్నామని అన్నారు. ఎన్నికలకు ముందే గెలుపు ఖాయమై బలమైన స్థాయికి చేరుకున్నామని చెప్పారు. ఇప్పటికే చిలకలూరిపేట నుండి విడదల రజిని ని వేరే చోటకు బదిలీ చేశారని, ఇక్కడ పోటీ గా నిలపడానికి కూడా వైసీపీ అభ్యర్ధులు దొరక్క వెదుక్కుంటోందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కావాలని, పని గట్టుకుని అక్కసుతో తమపై బుదర జల్లాలని చూస్తున్నారని అన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని ధీటుగా ఎదుర్కొంటామని, న్యాయపరమైన మార్గాల ద్వారా చేయాల్సింది చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Revanth Vs KTR: సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం .. నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం –  సీఎం రేవంత్ కు కేటిఆర్ ప్రతి సవాల్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N