అమెరికా మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ మృతి

అమెరికా 41వ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ తన 94వ ఏట కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి జార్జి బుష్ మరణించినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.
1989 నుంచి 1993 వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నజార్జి బుష్, అంతకు ముందు రెండు పర్యాయాలు(1981-1985, 1985-1989) ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. జార్జి బుష్ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ప్రచ్ఛన్న యుద్ధం జోరుగా సాగుతోంది. బుష్ తన రాజనీతిజ్ఞతతో, చొరవతో ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలకడానికి కృషి చేశారు. జార్జి బుష్ అనంతరం క్లింటన్ అధ్యక్ష పదవిని చేపట్టారు.