21న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్న ఆ నలుగురు ప్రముఖులు

Share

తెలంగాణలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలను సిద్దం చేసుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అధికార టీఆర్ఎస్ తో సహా కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను బీజేపీలోకి ఆహ్వానిస్తొంది. చేరికల కమిటీ కన్వీనర్ గా మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. ఈ నెల 21న బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన దాదాపు ఖరారు అయ్యింది. అమిత్ షా సమంక్షంలోనే పలువురు నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారు.

 

టీఆర్ఎస్ నేత, మంత్రి యర్రబెల్లి దయాకరరావు సోదరుడు ప్రదీప్ రావు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కన్నెబోయిన రాజయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ కుమార్ తదితరులు వారి అనుయాయులతో అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్ మీడియాకు తెలిపారు. ఈ నెలలో భారీగా చేరికలు ఉంటాయని గత నెలలోనే ఈటల రాజేందర్ ప్రకటించారు.

 

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఉద్యమకారులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అంతరించిపోవడంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక ఆ పార్టీకి నేతలు రాజీనామా చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ , టీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వివిధ పార్టీల నుండి చేరికల సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటునకు బీజేపీ రంగం సిద్దం చేస్తొంది.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

32 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago