NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: నలుగురు హైకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ .. పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

Share

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు, సీఎం వైఎస్ జగన్, నూతన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల కోటా నుండి ఈ నలుగురు న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీం కోర్టు కోలీజియం చేసిన సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. కేంద్ర న్యాయ శాఖ వీరి నియామకానికి సంబంధించి ఈ నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గానూ ప్రస్తుతం 27 మంది సేవలు అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. కాగా, కర్ణాటక నుండి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్త గా నియమితులైన నలుగురితో ఏపీ హైకోర్టు లో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుకుంది.

అంతకు ముందు సీఎం వైఎస్ జగన్ రాజ్ భవన్ తో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దుశ్సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు సీఎం జగన్.  ఈ సందర్భంగా నవంబర్ 1న జరగనున్న వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రధానోత్సవానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను సీఎం జగన్ ఆహ్వానించారు.

Gaganyaan: ఆరంభంలో అవాంతరం ఎదురైనా గగన్‌యాన్ టీవీ – డీ 1 పరీక్ష సక్సెస్


Share

Related posts

చంద్రబాబుని నిండా ముంచిన పవన్ కల్యాణ్!

CMR

Nowruz: నౌరూజ్ పండగ ఎవరు జరుపుకుంటారు.? ప్రత్యేకత ఏమిటంటే..?

bharani jella

కాశ్మీర్‌లో హిమపాతం

Siva Prasad