రష్యాలో గ్యాస్ ప్రమాదం – నలుగురు మృతి

మాస్కో,జనవరి 1: నూతన సంవత్సర వేడుకల వేళ రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దేశంలో పారిశ్రామిక నగరంగా పేరుగాంచిన  మాగ్నిటో గోర్‌సెక్‌లోని ఒక పెద్ద భవనంలో గ్యాస్‌ పేలుడు సంభవించడంతో నలుగురు మృతి చెందారు. ఇద్దరు పిల్లలతో సహా మరో నలుగురు గాయపడ్డారు. దాదాపు 70 మంది జాడ తెలియరాలేదు. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. మాస్కోకు 1700 కిమీల దూరంలోని మాగ్నిటోగోర్స్క్‌లో ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ  పేలుడు సంభవించింది. భవనంలోని చాలా భాగం కుప్పకూలింది. సహాయక చర్యల్లో భాగంగా 16 మందిని కాపాడగా శిథిలాల కింద 50 మంది వరకు చిక్కుకున్నట్లు ఒక వార్తా సంస్థ వెల్లడించింది. ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విచారం వ్యక్తం చేశారు.