NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

నివ్వెర పోయిన ప్రపంచం..! కరోనా టీకా వచ్చిన 24 గంటల్లోనే సంచలన ఫలితం బయటకు..!!

 

 

కరోనా మహమ్మారికి టీకా వచ్చేసిందనే వార్త తో ప్రపంచదేశాలన్ని కొంచెం ఊపిరి పీల్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు వ్యాక్సిన్ సరఫరా చేస్తుండగా మరికొన్ని దేశాలు ఇప్పటికే కరోనా టీకా అత్యవసర సర్వీస్ లు కూడా మొదలుపెట్టేశాయి. అయితే ఈ వ్యాక్సిన్ వల్ల కొన్ని దృష్ప్రభావాలు ఎదురవుతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి.

 

pfizer vaccine

కరోనా టీకా నియంత్రణ చర్యలో భాగంగా, వ్యాక్సిన్ల వినియోగాన్ని ప్రారంభించిన బ్రిటన్ లో 24 గంటలైనా గడవకముందే కలకలం రేగింది. ఫైజర్ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ వల్ల దృష్ప్రభావాలు చోటు చేసుకుంటున్నట్లు స్వయంగా బ్రిటన్ ప్రభుత్వమే వెల్లడించింది. ఫైజర్ టీకాను తీసుకునే విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ యూకే నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్), మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ)లు కీలక ప్రకటనలు చేశాయి.

అమెరికా ఫార్మా దిగ్గజం అయినా ఫైజర్ సంస్థ తన జర్మన్ భాగస్వామి బయోఎన్ టెక్ తో కలిసి రూపొందించిన వ్యాక్సిన్ సత్ఫలితాలు రావడంతో, యూకె ప్రభుత్వం తమ దేశంలో వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం తెల్పింది. అయితే ముందుగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, ఫ్రంట్ లైన్ వారియర్లకు టీకాలను అందించాలని నిర్ణయించుకుంది ఆ దేశం. దీనిలో భాగంగా విడతలవారీగా మాస్ వ్యాక్సినేషన్(సామూహిక టీకాల పంపిణీ) ను ప్రజలకి అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు కూడా చెప్పటింది.

pfizer vaccination

ఇంతలో అనుకోని రీతిలో వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం తో బ్రిటియాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదటిగా ఫైజర్ టీకాను బ్రిటన్ ఎన్‌హెచ్ఎస్ స్టాఫ్ కు అందించగా, వారిలో నలుగురు “బెల్స్ పాలసి”(ముఖపక్షవాతం)తో బాధపడ్తున్నట్లు డాక్టర్స్ గుర్తించారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆ నలుగురిని ఆస్పత్రిలోనే ఉంచి, ప్రత్యేక చికిత్స అందిస్తున్నది. ప్రయోగాత్మకంగా టీకా తీసుకున్న ఆ నలుగురికి ఒళ్లు దురద, వాంతులు, తలనొప్పి, ముఖం లో కండరాలు బిగుతుగా మారడం ముఖ పక్షవాతం రావడం వంటి లక్షణాలు తలెత్తాయని, టీకా తీసుకున్న తర్వాత ఎవరికైనా ఇలాంటి లక్షణాలొస్తే తక్షణమే ఆస్పత్రుల్లో చేరాలని యూకే ప్రభుత్వం ప్రకటన చేసింది. అంతేకాదు, అలెర్జీ లక్షణాలున్నవారు,నరాల బలహీనత ఉన్నవారు టీకాను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

టీకా తీసుకున్న వాళ్లలో సైడ్ ఎఫెక్ట్ కు గురైనవారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఇలా ఎందుకు జరిగిందనేదానిపై ఫైజర్ సంస్థను వివరణ కోరామని, టీకా తయారీ దారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని బ్రిటన్ ఎన్‌హెచ్ఎస్ డైరెక్టర్ స్టీఫెన్ పోవిస్ మీడియాకు తెలిపారు. ఫైజర్ వ్యాక్సిన్ సేఫ్టీ డేటాను మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని, ప్రస్తుతానికి టీకాల పంపిణీ యధావిధిగా కొనసాగుతుందని స్టీఫెన్ పేర్కొన్నారు.

 

pfizer chief executive albert bourla

దీనిపైనా స్పందించిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ బెల్స్ పాలసి కి ఫైజర్ వ్యాక్సిన్ కి ఎటువంటి సంబంధం లేదని వివరించింది. అయితే నరాల బలహీనత, అలర్జీ కంప్లెయింట్స్ చరిత్ర ఉన్నవాళ్లెవరూ వ్యాక్సిన్ తీసుకోకపోవడమే మంచిదని తెలిపారు అధికారులు. ఈ విషయం మీద ఫైజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్బర్ట్ బౌర్లా మాట్లాడుతూ టీకాలను తయారుచేసేటప్పుడు కంపెనీ “ఏ మూలలను వదలిపెట్టలేదని అన్ని క్షుణంగా పరిశీలించాకే టీకాను విడుదల చేశామన్నారు. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి సందేహించే వ్యక్తులు ఎల్లప్పుడూ ఉంటారు, కాని వారి సందేహం పూర్తి తప్పైనది అని నేను చెప్పాలి” అని ఫైజర్ సీఈఓ చెప్పారు.

యు.ఎస్. రెగ్యులేటర్లు మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఫైజర్ టీకా కోవిద్ -19 కు వ్యతిరేకంగా గబాగా పనిచేస్తుందని, ఈ మహమ్మారి నుండి రక్షించబడటానికి, అలాగే ఎంతో సురక్షితమైనదిగా అమెరికా ధృవీకరించింది.
యు.ఎస్ ఎఫ్‌డిఎ రెగ్యులేటర్లు తమ విశ్లేషణను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు.

ఇప్పటిదాకా అమెరికాలోనే ఆమోదం పొందని ఫైజర్ టీకాను బ్రిటన్ లో వాడేందుకు బోరిస్ సర్కారు అనుమతివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. మాస్ వ్యాక్సినేషన్లకు అనుమతిచ్చిన మొదటి దేశంగా బ్రిటన్.. మంగళవాంర నుంచే ప్రక్రియ మొదలుపెట్టింది. 90ఏళ్ల మార్గరెట్ కీనట్ తొలి వ్యాక్సిన్ డోసు తీసుకున్న ఫొటోలు వైరలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివ‌రిలోగా 40 ల‌క్ష‌ల మందికి ఫైజర్ టీకాను అందించాలనుకుంటోన్న బ్రిటన్.. ఆ మేరకు పంపిణీ ఏర్పాట్లు కూడా చేసుకుంది. మొత్తం నాలుగు కోట్ల టీకాల కోసం బ్రిటన్ ఆర్డర్ పెట్టుకుంది.

Related posts

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!