NewsOrbit
న్యూస్ హెల్త్

అయ్య బాబోయ్ 27 అయస్కాంతాలను మింగేసిన నాలుగేళ్ల బాలుడు.. చివరికి?

చిన్న పిల్ల‌లు చేసే చేష్ట‌లు న‌చ్చ‌ని వారు ఎవ‌రుంటారు చెప్పండి.. ! వారు చేసే ముద్దు ముద్దు ప‌నులు వారికే కాదు వారిని చూసే వాళ్ల‌కు సైతం అమిత‌మైన ఆనందాన్ని క‌లిగిస్తాయి. త‌ల్లిదండ్రులైతే ఆ పిల్ల‌ల గురించి తీసుకునే జాగ్ర‌త్త‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వారు సంతోషంగా, ఆనందంగా ఉండ‌టానికి వారు ఏ ప‌ని చేయ‌డానికైనా సిద్ధంగా ఉంటారు. మ‌రీ ముఖ్యంగా వారికి ఆట బొమ్మ‌లు కొనివ్వ‌డంలో చాలా ముందుంటారు.

అయితే, త‌న కుమారుని ఆనందం కోసం కొనిచ్చిన ఆట బోమ్మ‌లే.. ఆ బాలుడి ప్రాణాలు తీయ‌డానికి ప్ర‌య‌త్నించాయి. అంటే, ఆ ఆట‌బోమ్మ‌ల‌తో ఆడుకుంటున్న బాలుడు.. ఆ బోమ్మ‌ల‌తోనే త‌న ప్రాణాలు మీద‌కు తెచ్చుకున్నాడు. ఎలా అనుకుంటున్నారా? తాను ఆడుకోవ‌డానికి తీసుకున్న అయాస్కాంతాల‌ను మింగేశాడు. ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 27 అయ‌స్కాంతాల‌ను మింగేశాడు. ఈ ఘ‌ట‌న ఇండియానాలో చోటుచేసుకుంది. మ్యాక్ నెయిర్, జెస్సికా దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.

అయితే, బొమ్మ‌ల‌తో ఆడుకుంటున్న ఆ బాలుడు ఉన్న‌ట్టుండి ఏడ‌వ‌డం ప్రారంభించాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియ‌ని త‌ల్లిదండ్రులు ఆందోళ‌న గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఊపిరితీసుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న ఆ బాలున్ని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడిని ఎక్స్‌రే తీయగా.. మొత్తం 27 అయ‌స్కాంతాల‌ను మింగేసిన‌ట్టు వైద్యులు గుర్తించారు. ఈ 27 అయ‌స్కాంతాల్లో 25 క‌డుపులో ఉండ‌గా..మ‌రో రెండు గొంతులు ఉన్నాయి.

ఈ రెండు మాగ్నెట్ బాల్స్ బాలుడి గొంతులో ఇరుక్కోవ‌డంతో ఊపిరి తీసుకోవడానికి అడ్డుగా నిలిచాయి. దీంతో బాలుడు ఏడ‌వ‌డం మొద‌లుపెట్టాడ‌ని వైద్యులు తెలిపారు. ఎట్ట‌కేల‌కు బాలుడి క‌డుపులోంచి అయ‌స్కాంత బాల్స్ ను వైద్యులు బ‌య‌ట‌కు తీశారు. దీనిపై బాలుని త‌ల్లీదండ్రులు మాట్లాడుతూ.. అయస్కాంతాల‌తో ఆడుకోవడం చూశామ‌నీ, అయితే, కొద్ది సేప‌టి త‌ర్వాత చూస్తే.. ఆవి క‌నించ‌లేదు. ఇంత‌లోనే బాలుడు ఏడ‌వ‌డం మొద‌లు పెట్టాడ‌ని వివ‌రించారు. కాగా, ఆ పిల్ల‌వాడు ఆడుకుంటున్న మాగ్నెట్ బాల్స్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌వ‌ని వైద్యులు వెల్ల‌డించారు. అలాంటి వాటికి పిల్ల‌ల‌ను దూరంగా ఉంచాల‌నీ, పిల్ల‌ల‌ను ఎప్పుడూ ఓ కంట క‌నిపెట్టాల‌నీ, వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చూచిస్తున్నారు.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk