NewsOrbit
జాతీయం న్యూస్

Fraud: ఒకే వ్యక్తి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..! ఈ ద్విపాత్రాభినయం ఎలా బయటపడిందంటే..!?

Fraud: హీరో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయడం చూస్తుంటాము. కానీ ఓ వ్యక్తి నిజ జీవితంలోనూ ద్విపాత్రాభినయం చేశాడు. ఆ వ్యక్తి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తూ  దొరికిపోయాడు. చివరకు కటకటాల పాలైయ్యాడు. అసలు ఒక ఉద్యోగం దొరకడమే కష్టమైన ఈ రోజుల్లో ఓ ప్రభుద్ధుడు రెండు ఉద్యోగాలను ఉన్నతాధికారుల కళ్లగప్పి నిర్వహించడం విశేషం. ఒ పక్క ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా, మరో పక్క పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు అంటే ఆతని మేదస్సుకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. నెలో రెండు నెలలో కాదు ఏకంగా అయిదేళ్లుగా విధులు నిర్వహిస్తూ రెండు శాఖల నుండి జీతాలు తీసుకోవడం మామూలు విషయం కాదు. ఎక్కడైనా నేరాన్ని ఎక్కువ కాలం దాయలేరు కదా, ఏదో ఒక రోజు బయటపడుతుంది. అలానే ఈ ద్విపాత్రాభినయ ఉపాధ్యాయ పోలీస్ కథ బయటపడింది, చివరకు కటకటాల పాలైయ్యాడు.

Fraud: one man leads dual role as government teacher and constable
Fraud one man leads dual role as government teacher and constable

Read More: Extramarital Affair: గుగులమ్మ తల్లి పాఠాలతో నేరాలు..! అదెలానో చూడండి..!!

విషయంలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ అయిదేళ్ల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉద్యోగం వచ్చింది. అదే క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ కూడా నియమితులైయ్యాడు. రెండు ఉద్యోగాలు వచ్చిన అనిల్ కుమార్ పోలీస్ ట్రైనింగ్ పూర్తి అయిన తరువాత పోలీస్ ఉద్యోగానికి తన బదులు తన బావ సునీల్ కుమార్‌ను పంపాడు. అనిల్ కుమార్ పేరుతో అతని బావ సునీల్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్ (డయల్ 112 వాహన డ్రైవర్) గా మొరాదాబాద్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుండగా, అనిల్ కుమార్ మాత్రం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ వ్యక్తి మొరాదాబాద్ పోలీస్ స్టేషన్ కు అనిల్ కోసం ఫోన్ చేసి మాట్లాడాడు. అయితే తనతో మాట్లాడింది అనిల్ కాదని తెలుసుకున్న ఆ వ్యక్తి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అనిల్ పేరుతో వేరే వ్యక్తి అక్కడ విధుల్లో ఉన్నట్లు తెలిపాడు.

దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు అనిల్ ను పిలిపించి విచారించారు. అతని వ్యక్తిగత వివరాలు గురించి ప్రశ్నించారు. తాను ముజఫర్ నగర్ నుండి వచ్చాననీ, 2011 లో బరేలీ పోలీస్ లైన్ లో కానిస్టేబుల్ శిక్షణ పొందినట్లు వివరించాడు. శిక్షణ సమయంలో బరేలీ పోలీస్ లైన్ ఎస్ఎస్‌పీ గా పని చేసిన అధికారి పేరు అడగడంతో అతనికి నోట మాట రాలేదు. ఆ వెంటనే బాత్ రూమ్ కు వెళ్లివస్తానని పరారైయ్యాడు. దీంతో వారు అనిల్ కుమార్ కు సంబంధించిన ఎస్ఆర్ తెప్పించుకుని పరిశీలించగా అనిల్ కుమార్ పేరుతో వేరే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విచారణకు హజరైన వ్యక్తి అనిల్ కుమార్ బావ సునీల్ కుమార్ గా అధికారులు గుర్తించారు. అ తరువాత వారి ఇద్దరిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి అయిదేళ్లుగా ప్రభుత్వాన్ని మోసం చేశారన్న అభియోగంపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారం బయటపడటంతో ఇటు పోలీస్, అటు ఉపాధ్యాయ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!