NewsOrbit
న్యూస్

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) నిపుణులుగా రాణించాల‌నుకుంటున్నారా..? ఉచిత కోర్సులు ఇవే..!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాల‌జీకి ప్ర‌స్తుతం డిమాండ్ బాగా పెరిగింది. నేడు ఏ రంగంలో చూసినా AI విప్ల‌వాత్మ‌క మార్పులు తెస్తోంది. జ‌నాల‌కు మ‌రిన్ని అధునాత‌న సౌక‌ర్యాలు చేరువ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో టెక్ కంపెనీలు కూడా AI ద్వారా సాఫ్ట్‌వేర్ల‌ను డెవ‌ల‌ప్ చేసే ప‌నిలో ప‌డ్డాయి. గ‌త 2 సంవ‌త్స‌రాల కాలంలో AI నిపుణుల‌కు 60 శాతం వ‌ర‌కు డిమాండ్ పెరిగింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. 2025 వ‌ర‌కు AI రంగం 16 బిలియ‌న్ డాల‌ర్ల వృద్ధి సాధిస్తుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు AIలో ప‌రిజ్ఞానం ఉన్న నిపుణుల కోసం వెదుకుతున్నాయి. క‌నుక ఈ రంగంలో స్థిర‌ప‌డాల‌నుకునే వారికి చ‌క్క‌ని భవిష్య‌త్తు ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే అనేక మంది త‌మ‌కున్న సాఫ్ట్‌వేర్ నైపుణ్యాల‌కు తోడు AI లోనూ శిక్ష‌ణ తీసుకుంటూ మెళ‌కువ‌ల‌ను నేర్చుకుంటున్నారు. దీంతో వారికి మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. అయితే ఆస‌క్తి ఉన్న ఎవ‌రైనా ఈ కోర్సుల‌ను నేర్చుకోవ‌చ్చు. ఇందుకు గాను ప‌లు వెబ్‌సైట్లు ఉచిత శిక్ష‌ణ‌ను అందిస్తున్నాయి.

free course for Artificial Intelligence career aspirants

1. కోర్స్ఎరా – ఐబీఎం AI ఫౌండేష‌న్స్ ఫ‌ర్ బిజినెస్ స్పెష‌లైజేష‌న్

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాల‌ను నేర్చుకోవాల‌నే వారి కోసం ఈ కోర్సు ఉప‌యోగ‌ప‌డుతుంది. దీంట్లో AI, డేటా సైన్స్‌, మెయిల్ టూల్స్‌, AI ల్యాడ‌ర్ వంటి అంశాల్లో శిక్ష‌ణనిస్తారు. AI బేస్డ్ సొల్యూష‌న్స్ ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌వ‌చ్చు. ఈ కోర్సు కాల వ్య‌వ‌ధి 12 గంట‌లు మాత్ర‌మే. వెబ్‌సైట్‌: https://www.coursera.org/

2. యూడెమీ – ఇంట్ర‌డ‌క్ష‌న్ టు ఏఐ ఫ‌ర్ బిజినెస్

మార్కెట్‌లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న AI సాఫ్ట్‌వేర్లు, వాటితో బిజినెస్‌ను ఎలా మెరుగు ప‌రుచుకోవాలి, డేటా అన‌లిటిక్స్ వంటి అంశాల‌ను ఇందులో నేర్పిస్తారు. దీని వ‌ల్ల AI స్కిల్స్ మెరుగుప‌డ‌తాయి. AIని అర్థం చేసుకోవ‌డం తేలిక‌వుతుంది. ప‌లు రియ‌ల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌ను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ కోర్సు కాల‌వ్య‌వ‌ధిని 1 గంట‌గా నిర్ణ‌యించారు. వెబ్‌సైట్‌: https://www.udemy.com/

3. గ్రేట్ లెర్నింగ్ అకాడ‌మీ – AI ఫ‌ర్ లీడ‌ర్స్

డేటా సైన్స్‌ను అర్థం చేసుకోవ‌డం, బిజినెస్ అప్లికేష‌న్ల‌ను రూపొందించ‌డం, మెషిన్ లెర్నింగ్, అండ‌ర్‌స్టాండింగ్ AI వంటి అంశాల‌ను ఇందులో నేర్చుకోవ‌చ్చు. దీని వ‌ల్ల AIని ఎలా ఉప‌యోగించుకోవ‌చ్చు అనే విష‌యాలు తెలుస్తాయి. ఈ కోర్సు కాల వ్య‌వ‌ధి కూడా 1 గంటే. వెబ్‌సైట్‌: https://www.greatlearning.in/academy

4. ఎడ్ఎక్స్ – ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI)

కొలంబియా యూనివ‌ర్సిటీ ఈ కోర్సును అందిస్తోంది. దీంతో ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌లో ఫండ‌మెంటల్స్‌ను నేర్చుకోవ‌చ్చు. అలాగే AI అప్లికేష‌న్ల‌ను రూపొందించ‌డంపై మెళ‌కువ‌లు తెలుస్తాయి. ఈ కోర్సును కంప్లీట్ చేస్తే రియ‌ల్ AI స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే నైపుణ్యం వ‌స్తుంది. అలాగే మెషిన్ లెర్నింగ్ అల్గారిథంల‌పై ప‌ట్టు పెరుగుతుంది. ఈ కోర్సు కాల వ్య‌వ‌ధి 108 గంటలు. వెబ్‌సైట్‌: https://www.edx.org/

5. ఫ్యూచ‌ర్ లెర్న్ – యూజింగ్ AI టెక్నాల‌జీస్ ఫ‌ర్ బిజినెస్ ప్లానింగ్ అండ్ డెసిష‌న్ మేకింగ్

డేటా సోర్సెస్‌, నాలెడ్జ్ ఆక్విజిష‌న్‌, మెషిన్ లెర్నింగ్ అల్గారిథంలు త‌దిత‌ర అంశాల‌ను ఇందులో నేర్చుకోవ‌చ్చు. దీంతో AIను ఉప‌యోగించి బిజినెస్‌ను ఎలా డెవ‌ల‌ప్ చేయాలో తెలుస్తుంది. ఈ కోర్సు కాల వ్య‌వ‌ధి 6 గంట‌లు. వెబ్‌సైట్‌: https://www.futurelearn.com/

author avatar
Srikanth A

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N