Paytm Cylinder: పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకి పెను భారంగా మారాయి. గడిచిన సంవత్సర కాలంలో సిలిండర్ ధర రూ.190.5 వరకు పెరిగింది. జేబులో వెయ్యి రూపాయిలు ఉంటే గాని, సిలిండర్ బుక్ చేయలేని పరిస్థితి వుంది. అవును.. మరికొన్ని రోజులలో సిలిండర్ ధర రూ.1,000 దాటినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో Paytm అద్భుతమైన ఆఫర్ తో వచ్చింది. ఇది సామాన్యులు ఉపయోగించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
Paytm అందిస్తున్న ఆఫర్ ఏమిటి?
కావలసినవారు Paytm యాప్ నుండి గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే సుమారు రూ.900 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇలా ఒక్కసారి కాదు సుమా.. దాదాపు ఓ 3 నెలల పాటు ఈ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. అంటే సుమారు 2,700 రూపాయిల వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంది. “3 పే 2700 క్యాష్ బ్యాక్ ఆఫర్” పేరుతో ఈ బంపర్ ఆఫర్ అందిస్తోంది Paytm. గతంలో ఈ క్యాష్ బ్యాక్ చాలా తక్కువగా ఉండేది. దాన్నే ఇపుడు రూ.900 చేస్తూ కొత్త ఆఫర్ ప్రకటించింది.
ఇంతకీ ఎలా బుక్ చేసుకోవాలి?
హోమ్ స్క్రీన్లో ‘బుక్ గ్యాస్ సిలిండర్’ పైన క్లిక్ చేయాలి. తర్వాత సదరు గ్యాస్ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా LPG ఐడీ లేదా కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెర్చ్ లో వివరాలు వస్తాయి. తరువాత వివరాలు కన్ఫామ్ చేసుకొని బుకింగ్ పైన క్లిక్ చేయాలి. పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. ట్రాకింగ్ ద్వారా స్టేటస్ చెక్ చేయవచ్చు. తరువాత స్క్రాచ్ కార్డ్ స్క్రాచ్ చేస్తే క్యాష్ బ్యాక్ లభిస్తుంది.