NewsOrbit
న్యూస్ సినిమా

New Movies : ఈ శుక్రువారం ఆ మూడు సినిమాలు ఢీ అంటే ఢీ…! హిట్ కోసం ఎవరికి ఎంత రావాలంటే….

New Movies :  కరోనా ఆంక్షలు తీసేసిన తర్వాత థియేటర్లు తెరుచుకున్నాయి. అప్పటి నుండి ప్రతి శుక్రవారం సినిమా హాళ్ళ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సినిమా హీరోలు ఇంకా రిలీజ్ కాలేదు కానీ చిన్న సినిమాలే ప్రస్తుతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ప్రేక్షకులు కూడా మంచి సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ’ఉప్పెన’ సినిమా ఇప్పటికీ థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది/ అయితే ఈ శుక్రవారం మాత్రం ఆ సినిమాకు బ్రేక్ పడే లాగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు నుండి మూడు మంచి చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఇక ఈ సినిమాల ప్రీ-రిలీజ్ హైప్ ఏంటి…. వాటి బ్రేక్ – ఈవెన్ నెంబర్ ఏమిటో చూద్దాం…

 

Friday New Movies heavy competition
Friday New Movies heavy competition

మొదటిగా అన్నింటి కన్నా ఎక్కువ ప్రీ- రిలీజ్ బిజినెస్ జరుపుకొని అటు ఇటు గా ఊగిసలాడుతున్న సినిమా శర్వానంద్ హీరోగా నటించిన ‘శ్రీకారం’. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కింది. ట్రైలర్, టీజర్ లో కాన్సెప్టు కాస్త రొటీన్ గా ఉన్నప్పటికీ సినిమా పైన మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా నిన్న జరిగిన ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడిన మాటలు కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే రూ. 17.5 కోట్లు వసూలు చేయాలి.

ఈ సినిమా తర్వాత అతి భారీ అంచనాలతో వస్తున్న మరొక సినిమా ‘జాతిరత్నాలు’. యంగ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి హీరోగా ‘క్యాష్ అనుదీప్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికే మినిమమ్ గ్యారంటీ సినిమాగా థియేటర్ లోకి వస్తుంది. ఇందులోని ‘చిట్టి’ పాట అయితే అందరి ప్లే లిస్టు లో చేరిపోయింది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, నవీన్ పక్కన జాతిరత్నాలు గా ఈ సినిమాలో కనిపించి సందడి చేయనున్నారు. ఈ సినిమా బ్రేక్-ఈవెన్ కోసం రూ.11.5 కోట్లు సాధించాలి.

ఇక 11వ తేదీన విడుదల అవుతున్న మరొక తెలుగు సినిమా ‘గాలి సంపత్’. అనిల్ రావిపూడి దర్శకత్వం పర్యవేక్షణలో శ్రీ విష్ణు హీరోగా రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ కూడా చాలా కొత్తగా ఉంది. అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ…. అలాగే అది కొత్త కాన్సెప్ట్ తో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల మెప్పు పొందింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం రూ. 7 కోట్లు సాధించాలి. ఈ మూడింటితో పాటు కన్నడ నుండి ’రాబర్ట్’ అనే సినిమా కూడా వస్తోంది. హైదరాబాద్లో ఈ సినిమా పోస్టర్లతో సిటీ మొత్తం నింపేశారు. ఆ సినిమా తెలుగులో గట్టెక్కాలంటే 1.8 కోట్ల రూపాయలు రాబట్టాలి.

author avatar
arun kanna

Related posts

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella