పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది.. అలా సింగిల్ గా వచ్చిన సింహానికి చుక్కలు చూపించి.. పిడి గుద్ధులు గుద్ధి దాని వెన్నులో వణుకు పుట్టించాడు.. చివరికి దేహశుద్ధి చేసి పంపించాడు..ఈ విషయం ఇపుడు వైరల్ అయ్యింది.. పూర్తి సమాచారం ఇలా..
ఆఫ్రికా ఖండం లోని బోట్స్వానా దేశంలో వైల్డ్ లైఫ్ రీసెర్చర్ గా పనిచేస్తున్న గోట్స్ నీఫ్.. తన పనిలో భాగంగా ఒక మాంగో డెల్టాలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో ఏదో అలికిడి వినిపించగా ఏమైందో చూసేసరికి ఆకలితో ఉన్న సింహం అతని మీదకి పంజా విసిరింది. దాంతో మీ కేకలు పెట్టగా అతని స్నేహితులు ఆ సింహం నుంచి రక్షించేందుకు పలు విధాలుగా ప్రయత్నించారు. దగ్గరలో ఉన్న చెట్టు కొమ్మలను విసురుతూ, చేతికందిన వస్తువులను దానిపై విసిరే ప్రయత్నం చేయగా ఆ సింహం ఏమాత్రం జంకకుండా అతని ప్రాణాలు తీసే ప్రయత్నం లోనే ఉంది.
చివరికి నీఫ్ తనే ఎదురుదాడి చేశాడు. ఆగకుండా సింహం మొహం మీద పిడి గుద్ధుల వర్షం కురిపించి దానికి ఊపిరాడకుండా చేశాడు.. ఎట్టకేలకు అది పారిపోయింది. ఈ ఎదురుదాడి లో రెచ్చిపోయిన సింహం వలన అతని మోచేతిని కొరకడంతో తీవ్రమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న అతని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.. సింహం తో పోరాడిన నీఫ్ ను నెటిజన్లు ధైర్యశాలి అని అభినందిస్తున్నారు..