Front Yard: సాధారణంగా హిందూ సంస్కృతిని పాటించే ఇళ్లల్లో సూర్యాస్తమయ సమయం అయితే వాకిలి Front yard ఊడ్చి కళ్ళాపి జల్లి అందంగా ముగ్గు పెడుతూ ఉంటారు. ఈ తరం లో కొంతమంది మాత్రమే ఈ ఆచారాన్ని ఆచరిస్తున్నారు. ఎక్కువ మంది చీకటి పడిన తరువాతే వాకిలి ఊడుస్తున్నారు. వారు ఇలా చెయ్యడానికి వెనుక ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు కానీ మన పెద్దలు సూర్యాస్తమయం లోపే ఎందుకు వాకిలి ఊడ్చుకోవాలి అని చెప్పారు అంటే దాని వెనుక కచ్చితంగా ఏదొక రీసన్ ఉండే ఉంటుంది. మన పెద్దలు చెప్పే ప్రతి మాటలో ఏదొక మంచి దాగి ఉంటుంది.
ఈ తరానికి అది అన్వయం కాకపోయినా కొన్ని పద్ధతులు పాటించడం మంచిదే. సాయంత్రం సమయంలో చీకటి పడక ముందు వాకిలిని ఊడ్చి అనంతరం దేవుడికి దీపం పెట్టాలని మన ప్రాచీన భారతీయ సంప్రదాయం చెబుతుంది. అదృష్ట దేవతను ఆకర్షించడానికై దురదృష్ట దేవతను దారికి రానివ్వకుండా ఉంచాడని ఈ విధమైన ఆచారం వ్యాప్తిలో ఉంది. ఇంటి ముందు ఉన్న చెత్త చెదారం తీసి వేసి శుభ్రంగా ఊడ్చి కళ్ళాపి చల్లి ముగ్గు పెట్టాలి. కళ్ళాపి జల్లుతున్న నీటిని పవిత్ర గంగా జలంగా భావించాలి. ఇంటి లోని స్త్రీలు ఈ పని చెయ్యాలని ఉద్దేశింపబడినది.
కానీ కొందరు చీకటి పడిన తరువాత వాకిలి ఊడ్చి కళ్ళాపి చల్లడం లాంటివి చెయ్యడానికి సాహసిస్తారు. కానీ చీకటి పడిన తరువాత వారు వాకిలి ని అంత శుభ్రంగా ఊడవలేకపోతారు. అలాగే చీకటి పడిన తరువాత నేల పై పాకే ప్రాణులు తమ గూళ్ళు నుంచి బయటకు వస్తాయి. కాబట్టి సూర్యాస్తమయానికి ముందే ఈ పరిశుభ్రత కార్యక్రమం చేపట్టడం సరైనైటువంటిది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?