NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Fuel Prices : లీటరు పెట్రోలు 80 రూపాయలే…! డీజిల్ అయితే రూ. 65 మాత్రమే… అదీ మన దేశంలోనే

Fuel Prices :  అవును మీరు విన్నది నిజమే..! పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక సామన్యులంతా విలవిలలాడిపోతూ ఉంటే దేశ ప్రజల్లో కొందరు పైన చెప్పిన ధరకే పెట్రోల్ను డీజిల్ లను తెచ్చుకుంటున్నారు. విపరీతంగా పెరిగిపోయిన ఇంధన ధరలను భరించలేక వాహనదారులు ఎన్నో పాట్లు పడుతున్న విషయం తెలిసిందే. నిరుపేదలు అయితే నానా అవస్థలు పడుతున్నారు. అయితే ఈ పరిస్థితులు తప్పించుకునేందుకు తమ దగ్గర ఉన్న అవకాశాన్ని బీహార్ ప్రజలు చక్కగా వాడుకుంటున్నారు

 

These Fuel Prices in india are shocking
These Fuel Prices in india are shocking

వివరాల్లోకి వెళితే…. నేపాల్ పారిశ్రామిక రాజధాని గా పిలువబడే ప్రాంతం నుండి పెట్రోల్ తరలిస్తున్న ట్యాంకర్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విషయం ఏమిటంటేభారత దేశానికి సరిహద్దు దేశామైన నేపాల్ కు బీహార్ నుండి గ్రామాల్లో ఉన్న ప్రజలు వెళ్లి పెట్రోల్ కొనితెచ్చుకుంటున్నారు. భారత్నేపాల్ సరిహద్దులో చాలావరకు తెరిచే ఉంటాయి. కొన్ని చోట్ల అసలు గస్తీ వంటివి ఉండవు. దర్జాగా నడుచుకుంటూ వెళ్ళి పెట్రోల్ తీసుకువస్తున్నారు. వారి నుండి సాధారణ ధరకే జనం కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే…. భారత్ తో పోలిస్తే నేపాల్ లో లీటర్ డీజిల్ సుమారు 27 రూపాయలు తక్కువ ఉండగా పెట్రోల్ ధర 23 రూపాయలు తక్కువగా ఉంటుంది.

ఇంతకన్నా షాకింగ్ న్యూస్ మరొకటి వుంది. నేపాల్ పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేసేది భారతదేశం నుండే కావడం గమనార్హం. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ కి భారత్ నుండి ప్రతి ఏటా దాదాపు 71 వేల 673 కిలోలీటర్ల చమురు వెళ్తుంది. మన దగ్గర నుండి అంత ఎక్కువ మొత్తంలో చమురు కొనుగోలు చేసినప్పటికీ ఆ దేశంలో ధరలు తక్కువగా ఉంటాయి. ఇందుకు ప్రధాన కారణం రెండు దేశాలు విధించే పన్నులలో ఉన్న వ్యత్యాసం. నేపాల్ దేశంలో పన్ను విధానం మరొక లాగా ఉంటుంది. మన దేశంలో ఎక్సైజ్ డ్యూటీ తో పాటు ప్రతి రాష్ట్రం కూడా వ్యాట్ ట్యాక్స్ వేస్తుంది. ఇక రాష్ట్రం లో వ్యాట్ ట్యాక్స్ ను బట్టి లీటరు పెట్రోల్, డీజిల్ ధర కొన్ని రూపాయాలు అటు ఇటు గా ఉంటాయి.

 మన దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిన తర్వాత బీహార్ సరిహద్దు ప్రాంతంలో ఇంధనం కొనుగోళ్ళు భారీగా తగ్గాయి. చాలా మంది ప్రజలు పక్క ఊరికి వెళ్లినట్టు నేపాల్ కు వెళ్లి హాయిగా పెట్రోలు కొనుక్కుంటారు. అంతేకాదు సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ప్రజలకు అక్కడ చుట్టరికాలు కూడా ఉంటాయి కాబట్టి వారికి పెద్దగా ఆంక్షలు ఉండవు. దర్జాగా వాహనం వేసుకొని వెళ్లి ఫుల్లు గా పెట్రోల్ పట్టుకొని వస్తున్నారట. మరికొందరైతే భారీగా పెట్రోల్ ను ఇండియా కి అక్రమంగా తరలించి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వీళ్ళ పని బాగుంది కదూ….

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju