ట్రెండింగ్ న్యూస్ సినిమా

Gali Sampath : క్యాష్ షోలో గాలి సంపత్ సందడి?

Gali Sampath : క్యాష్ షోలో గాలి సంపత్ సందడి?
Share

Gali Sampath : గాలి సంపత్ Gali Sampath తెలుసు కదా. అదేనండి.. మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. ఆయన కామెడీకే కింగ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాలి సంపత్. ఈ సినిమాకు అనీల్ రావిపూడి డైరెక్టర్. రాజేంద్ర ప్రసాద్ తో పాటు శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Gali sampath in cash show
Gali sampath in cash show

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. గాలి సంపత్ టీమ్ క్యాష్ షోలో సందడి చేసింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు, సినిమా హీరోయిన్, డైరెక్టర్ అనిల్ రావిపూడి.. క్యాష్ షోకు వచ్చి సందడి చేశారు.

Gali Sampath : గాలి సంపత్ హడావుడి మామూలుగా లేదు?

గాలి సంపత్ పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించి అందరినీ మెప్పించారు. బాహుబలి సినిమాలో కిలికి భాష ఎలాగో.. ఈ సినిమాలో గాలి సంపత్ భాష అలాగ అన్నమాట. రాజేంద్ర ప్రసాద్.. ఫ భాషలో మాట్లాడుతూ అందరినీ అలరించారు.

ఈసందర్భంగా క్యాష్ షోకు వచ్చిన రాజేంద్రప్రసాద్.. యాంకర్ సుమతో కలిసి కాసేపు సరదగా గడిపారు. రాజేంద్రప్రసాద్ అంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఆయన ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. తాజాగా క్యాష్ షోలో యాంకర్ సుమతో కలిసి రాజేంద్ర ప్రసాద్ చేసిన హడావుడి మామూలుగా లేదు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్కేయండి.

 


Share

Related posts

RRR: ఓ సునామీ ఇప్పట్లో ఆపడం ఎవరి తరం కాదు..

GRK

Revanth Reddy vs Malla Reddy: మంత్రి మల్లారెడ్డి అక్రమాల భారీ చిట్టా బయటపెట్టిన రేవంత్ రెడ్డి..! కానీ చివర్లో ఒక ట్విస్టు..!?

somaraju sharma

‘టిఆర్ఎస్ డేటా దొంగ’

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar