NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఇండియా – చైనా వివాదం గల్వాన్ గురించి తెలుసుకోండి…!!

ఆ లోయ మాది అని చైనా అంటుంటే… మాదే అని ఇండియా అంటుంది. లడక్ సమీపంలోని ఈ లోయ గురించి గతంలోనూ అనేక వివాదాలు జరిగాయి. అసలు ఈ లోయ చరిత్ర ఏంటి…? ఎలా ఏర్పడింది…? ఆ పేరు ఎలా వచ్చింది..? ఆ గల్వాన్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు…? అనే ఆసక్తికరమైన విశేషాలు.

గల్వాన్‌ లోయ ఇప్పుడు.. ఎప్పుడు భారతదేశంలో భాగమని అమీన్‌ గల్వాన్‌ అన్నారు. ప్రముఖ సాహసికుడు గులాం రసూల్‌ గల్వాన్‌ పేరు మీదుగా ఈ ప్రాంతానికి గల్వాన్‌ లోయ అనే పేరు వచ్చింది. ఆ రసూల్‌ గల్వాన్‌ మనవడే ఈ అమీన్‌ గల్వాన్‌. ఈ క్రమంలో లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సోమవారం రాత్రి గల్వాన్‌ లోయలో ఇరుదేశాల సైనికుల ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు మరణించారు. 43 మంది చైనా సైనికులు కూడా మరణించారని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయి.

చైనా మాత్రం ఇప్పటి వరకు తమ సైనికులు ఎంతమంది చనిపోయారో అధికారికంగా ప్రకటించలేదు. గల్వాన్‌ ఘటన తర్వాత ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల వైరంపై గల్వాన్ మనవడు అమీన్ గల్వాన్ స్పందించారు. ఈ ప్రాంతం ఎప్పటికి భారతదేశంలో భాగమని తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఆ పేరు రావడం వెనక ఉన్న కథను వివరించారు.

‘మా తాత రసూల్‌ గల్వాన్‌ 1878 లో లేహ్‌లో జన్మించాడు. 12 సంవత్సరాల వయసులో టిబెట్, మధ్య ఆసియాలోని పర్వతాలు, ముఖ్యంగా కారకోరం రేంజ్‌లో బ్రిటిష్ వారికి గైడ్‌గా పనిచేయడం ప్రారంభించాడు. 19వ శతాబ్దంలో భారత్‌ను పాలిస్తున్న బ్రిటీషర్లు రష్యా ఆక్రమణల గురించి భయపడుతుండేవారు. ఆ సమయంలో మా తాత రష్యన్ల గురించిన సమాచారాన్ని బ్రిటీష్‌ వారికి చేరవేస్తుండేవాడు. ఈ క్రమంలో ఓ సారి లాడ్‌ డ్యూనమోర్‌ అక్సాయ్‌ చిన్‌ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చాడు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా దారి తప్పారు. అప్పుడు వారికి గైడ్‌గా ఉన్న మా తాత కొత్త మార్గాన్ని అన్వేషించి వారిని చావు నుంచి కాపాడి.. క్షేమంగా తిరిగి తీసుకొచ్చాడు. అందుకు కృతజ్ఞతగా బ్రిటీషర్లు డన్మోర్‌ లోయ, నదికి మా తాత రసూల్‌ గల్వాన్‌ పేరు పెట్టారు’ అని తెలిపాడు. 1962లో కూడా చైనా గల్వాన్‌ లోయ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించింది. కానీ ఈ ప్రాంతం అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు భారతదేశంలో భాగం అన్నారు.

author avatar
Srinivas Manem

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju