Gang leader : గ్యాంగ్ లీడర్ సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవి-విజయ శాంతి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అనుకునేరు ఎంతమాత్రం కాదు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. మెగా బ్రదర్ నాగబాబు చేయాల్సిన కథను చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు కథలో భారీ మార్పులు చేసి తెరకెక్కించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్. కాబట్టి ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్లాప్ అయిన సినిమా నాని నటించిన గ్యాంగ్ లీడర్. మనం సినిమాతో టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిన విక్రం కె కుమార్ దీనికి దర్శకత్వం వహించాడు. సీనియర్ నటీమణులు కీలక పాత్రలు పోషించారు.
డైరెక్టర్ విక్రం కుమార్ ఎంతో నచ్చి ఈ కథ రాసుకున్నాడట. నానికి ఇదే కథ విపరీతంగా నచ్చిందట. నానికి నేచురల్ స్టార్ అని పేరుంది కాబట్టి ఈ కథ తనకు బాగా సూటవుతుందని జడ్జ్ చేసుకొని కమిటయ్యాడు. మలయాళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. కథ, కథనం, అందులో నటించిన నటీ, నటులు, హీరో అయినా విలన్ పాత్రలో కనిపించిన ఆర్ ఎక్స్ 100 ఫేం కార్తికేయ తమవంతు కష్టపడ్డారు. కానీ డైరెక్టర్, నాని ఊహించిన సక్సెస్ దక్కలేదు. సాధారణంగా ఎవరైనా తాము చేసే సినిమా మీద అంచనాలు పెట్టుకుంటారన్నది సహజమే.
Gang leader : గ్యాంగ్ లీడర్ రిలీజైన మొదటి ఆట నుంచే ఫ్లాప్ అనే మాట వినిపించింది.
అలాగే వీరు కూడా చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని రీతిలో గ్యాంగ్ లీడర్ రిలీజైన మొదటి ఆట నుంచే ఫ్లాప్ అనే మాట వినిపించింది. అయితే డైరెక్టర్ ఒక విషయంలో చాలా సాటిస్ఫై అయ్యాడు. తెలుగులో ఫ్లాప్ గా నిలిచిన సినిమా ఇతర భాషల్లో అధికారక రీమేక్ చేస్తుండటమే. అంటే కథ బావుంది. తీయడం కూడా బావుంది. అయితే గ్యాంగ్ లీడర్ కథలో నాని సెట్ అవలేదు. నానికి ఈ కథ ఏమాత్రం సెట్ కాకపోవడం వల్లే ఫ్లాప్ అయింది. కానీ కథకి ప్రశంసలు దక్కాయి. అందుకే తెలుగు, హిందీ, తమిళ లాంగ్వేజస్ లో తెరకెక్కిస్తున్నారు.