బిగ్‌బాస్ ఇంటిలో ఉన్న కంటెస్టెంట్ లతో ఒక గొడవ అంటే ఎలిమినేట్ అయిపోయిన వారు బయటకు వచ్చి చేసేది ఇంకొంత వినూత్నంగా ఉంటుంది ఇక యాంకర్ లాస్య తన తోటి కంటెస్టెంట్ కలుసుకుంటూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
ఈ క్రమంలోనే గంగవ్వతో ఆమె ఇంటిని లాస్య సందర్శించగా ఒకరి భావాలను మరొకరు పంచుకున్నారు. ఇంటిలో గంగవ్వ లాస్య తో కలిసి పంచుకున్న ముచ్చట్లను వెల్లడించింది జున్ను గురించి బాగా గుర్తు చేసుకునేది తన భర్తను తలుచుకునేది తన అమ్మ గురించి ఎక్కువగా చెప్పేది అలాగే ఆమె కుటుంబాన్ని తలుచుకుని ఏడ్చిన రోజులు కూడా బాగా గుర్తున్నాయి అని చెప్పడం గమనార్హం.
ఇక జున్ను కోసమే తను ఇంత కష్టపడుతున్నాను అని తనకు లాస్య చెప్పినట్లు గంగవ్వ గుర్తు చేసుకుంది. ఇకపోతే లాస్య కు గంగవ్వ తన కొడుకు గురించి బెంగ పడకు అని… అతను మంచి స్కూల్ కి వెళ్తాడు అని చెప్పింది. అలాగే సరదాగా మంచిగా రెండు పెళ్లిళ్లు చేసుకుంటాడు అంటూ కామెంట్ చేసింది రెండు పెళ్లిళ్లు ఎందుకు అవ్వ అని లాస్య అంటే ఈ రోజుల్లో ఇద్దరు ఉండాలి అని గంగవ్వ కామెంట్ చేసింది అప్పుడు లాస్య మా వారికి నేను ఒక్కదాన్నే మా అబ్బాయికి కూడా ఒకటే ఉండాలి అని చెప్పింది.
ఇక గంగవ్వ తన ఇంటి నుండి బయటకు వచ్చేసిన తర్వాత అందరూ ఆమెను గుర్తు చేసుకుంటున్నారా లేదా అని అడిగింది. గంగవ్వ ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అన్న విషయాన్ని కచ్చితంగా చెప్పడం గమనార్హం.