NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vizag Steel Plant : రాజీనామా పై గట్టిగానే నిలబడ్డ గంటా !మిగతా వారి మాటేమిటంట ?

Vizag Steel Plant : జగన్ చేతిలో ఆయుధాలున్నాయ్..! బీజేపీని ఎదిరించగలరా..!?

Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు మరోసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

ganta stood firm on resignation
ganta stood firm on resignation

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి ఏం చేయడానికైనా తాను సిద్ధమేనని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇందుకోసం ఇప్పటికే తాను రాజీనామా చేశానన్నారు. స్పీకర్‌ ఫార్మేట్‌లో రాజీనామా ఇవ్వలేదని కొందరు అంటున్నారని… స్పీకర్‌ ఏ ఫార్మాట్‌లో కోరితే ఆ ఫార్మాట్‌లో ఇస్తున్నానన్నారు. ఈ మేరకు శుక్రవారం మరోసారి కార్మికుల ఎదుటే రాజీనామా చేశారు.కూర్మనపాలెం గేట్‌ దగ్గర కార్మికసంఘాల రిలే నిరాహారదీక్షలో రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయవల్సిందిగా జర్నలిస్టులను కోరారు. తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ రక్షణకు ప్రతి ఒక్కరూ కదలిరావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Vizag Steel Plant : గంటా సరే ..మిగతా వారి మాటేమిటి?

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ఆందోళనకు గంటా శ్రీనివాసరావు మద్దతు పలికారు.విశాఖ ఉక్కు ఉద్యమం రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఉద్యమంలో పాల్గొనకపోతే ఒక ఇబ్బంది.. పాల్గొంటే మరో ఇబ్బంది నేతలను కాచుకుని ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో నేతలు ఉద్యమ బాట పడుతున్నారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటుపరమవుతుందనే వార్తలతో ఏపీలో ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.కార్మికులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అది రాజకీయ వర్గాల్లో కలకలం చెలరేగింది. ఉనికి కాపాడుకోవాలంటే స్టీల్‌ ప్లాంట్‌పై పట్టు నిలుపుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నేతలది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.ఇంకా విశాఖ లో చాలామంది అగ్ర నేతలున్నారు.వారు ఏం చేస్తారన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం.

ఒకే వేదికపై గంటా ..అవంతి !

విశాఖ ఉక్కు ఉద్యమంలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. ఒకే వేదికపై గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావు దర్శనమిచ్చారు. మరోవైపు ఉక్కు ఉద్యమం కేంద్రంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకు అవంతి శ్రీనివాసరావు.. జగన్‌ను, గంటా శ్రీనివాసరావు.. చంద్రబాబును ఒకే వేదికపైకి తీసుకురావాలన్నారు.రాజకీయాలకు అతీతంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగాలన్నారు నారాయణ. ప్లాంట్ నష్టాల్లో ఉంటే ప్రైవేట్ వాళ్లు ఎందుకు కొంటారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ను సాధించుకునే వరకూ రాజకీయ విమర్శలకు విరామం ఇవ్వాలన్నారు. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఉద్యమం కొనసాగించాలని కోరారు. స్టీల్ ప్లాంట్ అంశంపై వెంకయ్యనాయుడు స్పందించాలన్నారు.

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju