Categories: న్యూస్

Gas cylinder : గుడ్ న్యూస్.. ఇలా చేస్తే గ్యాస్ సిలిండర్ పై రూ.370 ఆదా..!!

Share

Gas cylinder : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు. ప్రస్తుత కాలంలో వంటలు వండటానికి ఇది తప్పనిసరి అయ్యింది కానీ దీని ధర ఎప్పటికప్పుడు పెరుగుతూనే పోతుంది. ప్రస్తుతం గ్యాస్ కోసం ప్రజలు సుమారు రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది. దాంతో గ్యాస్ సిలిండర్ ఫిల్ చేయించాలంటే చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన వస్తోంది. ప్రత్యేకంగా దీని కోసం పొదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గ్యాస్ సిలిండర్ భారాన్ని తగ్గించుకునేందుకు ఓ మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

Gas cylinder : పైప్డ్ నేచురల్ గ్యాస్

ఎల్‌పీజీ గ్యాస్ కోసం వేలలో జేబులకు చిల్లు పెట్టించుకోవడానికి బదులు పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) గ్యాస్ వాడితే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు. మీరు పీఎన్‌జీ గ్యాస్ వాడటం వల్ల ఎల్‌పీజీ సిలిండర్‌ కంటే రూ.300 ఆదా చేసుకోవచ్చు. అదెలా? అని తికమకపడుతున్నారా.. అయితే మీరు ఓ నిజం తెలుసుకోవాల్సిందే.

14.2 కేజీల పీఎన్‌జీ గ్యాస్ సిలిండర్ ధర రూ.580

సాధారణంగా మనం ఇళ్లలో వాడే అన్ని ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బరువు 14.2 కేజీలు ఉంటుంది. ఇది రూ.950 ధరతో ప్రస్తుతం లభిస్తోంది. దీనర్ధం ఒక కేజీ గ్యాస్ కు రూ.66.90 వెచ్చించాల్సి వస్తోంది. ఇక పీఎన్‌జీ గ్యాస్ ధర చూసుకుంటే.. ఒక్క స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు రూ.35.61 చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడ కాస్త మాథ్స్ ఉపయోగించి.. క్యూబిక్ మీటర్స్‌ను కేజీల్లోకి చేంజ్ చేస్తే.. కేజీ పీఎన్‌జీ గ్యాస్ ధర రూ.41 పలుకుతుందని తెలుస్తుంది. అలా 14.2 కేజీలకు లెక్క కడితే 580 రూపాయలు అవుతుంది. దీన్నిబట్టి మీరు రూ.950 కి బదులు రూ.580 చెల్లించి పైప్డ్ నేచురల్ గ్యాస్ తీసుకుంటే.. రూ.370 ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం భారత ప్రభుత్వం పీఎన్‌జీ గ్యాస్‌ను జనాలకు అందించేందుకు కృషి చేస్తుంది. ఇప్పటికే ఏకంగా 400 జిల్లాల్లో 4 కోట్ల పీఎన్‌జీ కనెక్షన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఓ ప్లాన్ రూపొందించి ఆ దిశగా ముందడుగు వేస్తోంది. దీని వల్ల చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం కలుగనుంది. పీఎన్‌జీ అనేది వంట (గ్యాస్ స్టవ్స్), వాటర్ హీట్ (గ్యాస్ గీజర్లు) కోసం ఉపయోగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.

Free Gas Cylinder: మీకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలా? అయితే ఇలా చేయండి!

Share

Recent Posts

దృశ్యం 3 నుంచి అదిరిపోయే అప్‌డేట్.. చివరికి హీరో అరెస్ట్ అవుతాడా..?

  ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…

20 mins ago

మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారపదార్ధాల జోలికి అసలు పోకండి..!

మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…

21 mins ago

2వ రోజు తేలిపోయిన నితిన్ `మాచర్ల‌`.. ఆ రెండే దెబ్బ కొట్టాయా?

`భీష్మ‌` త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్‌గా `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…

50 mins ago

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…

1 hour ago

ఈ అద్భుతమైన టీ ల గురించి మీలో ఎంతమందికి తెలుసు..??

టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…

3 hours ago

టీఆర్ఎస్ మంత్రులకు షాక్ లు .. మరో మంత్రి అనుచరుడు బీజేపీలోకి..

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…

4 hours ago