వంట గ్యాస్ ధర తగ్గుదల

ఢిల్లీ, జనవరి 1 : వినియోగదారులకు సబ్సిడీపై అందించే వంట గ్యాస్ సిలిండర్‌ ధర అయిదు రూపాయల 91 పైసలు తగ్గించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 14.2 కేజీల ఎల్‌పిజీ సిలిండర్ ధర ఢిల్లీలో 590.90 నుండి 494.99 రూపాయలకు తగ్గింది.
జీఎస్జీతో పాటుగా ఇతర పన్నుల కారణంగా కస్టమర్స్‌కు 689 రూపాయలకు అందజేస్తారు. సిలండర్ పై రాయితీ కింద వినియోగదారుడికి తిరిగి 194.01 రూపాయలు ఖాతాలో జమచేస్తారు. కమర్షియల్ సిలెండర్ ధర 120.50 రూపాయల మేర తగ్గింది.