NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Gaurav Khanna: పారా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కోసం తన 15 ఏళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన కోచ్ గురించి తెలుసుకుందాం..!

Gaurav Khanna the para badminton coach

Gaurav Khanna: ప్రమోద్ భగత్, కృష్ణా నగార్, సుభాష్ ఎల్ వై, పరుల్ పర్మార్ వంటి టాప్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ ప్లేయర్లని తయారు చేసిన గౌరవ్ ఖన్నా గురించి… అతని కోచింగ్లో పతకాలు సాధించిన ప్లేయర్ ల కంటే ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 

 

Gaurav Khanna the para badminton coach

చిన్నప్పటినుండే బాడ్మింటన్

లక్నో లో ఉండే గౌరవ్ ఖన్నా చిన్నతనంలోనే బ్యాడ్మింటన్ ఆడడం మొదలు పెట్టాడు. ఎన్నో రాష్ట్ర, జాతీయ కాంపిటీషన్లో ఎనలేని విజయాలు సాధించిన గౌరవ్ 1998లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం సంపాదించాడు. తను బ్యాడ్మింటన్ ట్రైనింగ్ తీసుకునే రోజుల్లో వెనుకబడిన ప్లేయర్లు… ఇతర అవలక్షణాలు ఉన్నవారు వచ్చి అతనితో పాటు అదే స్ఫూర్తితో ఆడడం గమనించాడు. 

Gaurav Khanna: పారా అథ్లెట్లకి ‘ది గురు’

తన కెరీర్ అయిపోయిన తరువాత వీరందరికీ సహాయం చేయాలని… వారికి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎవరైతే బాగా ఆడి త్వరగా మంచి నైపుణ్యం సంపాదిస్తారో వారిని తప్పించి మిగిలిన వారి మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. ఇక నడవలేకుండా వీల్ చైర్ లో ఉన్నవారికి కూడా వారిని షటిల్ వైపు ఎలా చురుకుగా ఎలా కదలాలో ఓపిగ్గా నేర్పించారు.

ఇది ఎంతో కష్టమైన పని అయినప్పటికీ ఎంతో ఏకాగ్రతతో ఓపికతో వారికి తన సేవలను అందించాడు. అలా ఎంతో మందికి ప్రభుత్వాల నుండి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుండి స్పాన్సర్స్ రాబట్టడం కోసం పాటుపడ్డాడు. 2000 సంవత్సరంలో ఎటువంటి లాభం లేని కోచింగ్ అకాడమీ ను ప్రారంభించిన గౌరవ్ కాంటినెంటల్ చెవిటివారి ఛాంపియన్షిప్లో పాల్గొన్న ఆసియా టీం కి కోచ్ గా వ్యవహరించాడు. అతని విద్యార్థులు కొంత మంది ప్రపంచ ఛాంపియన్ల గా ఎదిగి వారే. వారే మనోజ్ సర్కార్, ప్రమోద్ భగత్, కృష్ణా నగార్, సుభాష్ ఎల్ వై, పరుల్ పర్మార్.

Gaurav Khanna the para badminton coach

Gaurav Khanna: ప్రతీ ఏడాదికీ పెరుగుదల

టైమ్స్ ఆఫ్ ఇండియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌరవ్ మాట్లాడుతూ మామూలుగా జాతీయ కాంపిటీషన్ కి 40 నుండి 50 మంది వస్తారు. అయితే 2017 సమయానికి 150, 2019 లో 300 ఎంట్రీల వరకు వచ్చారు. భారతదేశంలో పారా అథ్లెట్ల సంఖ్య పెరగడానికి దీనికన్నా ఇంక ఉదాహరణ లేదు. 

ఆగస్టు 2020లో గౌరవ్ కు కేంద్ర ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డు ఇచ్చి సత్కరించింది. పారా-బ్యాడ్మింటన్ ప్లేయర్ల కోసమే అచ్చంగా ఒక అకాడమీ స్థాపించాడు గౌవ్. ప్రస్తుతం టోక్యో పారా ఒలంపిక్స్ లో మన వాళ్ళు పతకాలు కొల్లగొడుతున్నారు. ఇప్పుడు గౌరవ్ విద్యార్థులైన తరుణ్ దిల్లోన్, పాలక్ కోహ్లీ, సుహాస్, ప్రమోద్ భగత్, కృష్ణా నగార్, సుభాష్ ఎల్ వై, పరుల్ పర్మార్  భారతదేశం తరఫున ఆడనున్నారు.

author avatar
arun kanna

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju