Genelia: ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరోలతో నటించిన రమ్య కృష్ణ, ఆమని, అమల, విజయశాంతి… ఆ తర్వాత హీరోలతో నటించిన భూమిక, మరికొంతమంది హీరోయిన్లు రీ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా బొమ్మరిల్లు సినిమా తో.. టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో అలరించి. హా హా హాసిని పాత్రతో మెప్పించిన జెనీలియా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని సమాచారం. జెనీలియా అప్పట్లో నటించిన సై, బొమ్మరిల్లు, డీ మరి కొన్ని సినిమాలలో.. ప్రేక్షకులను ఎంతగానో అలరించడం జరిగింది.
ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరో తో పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయ్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెడీ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్టయ్యింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2008వ సంవత్సరంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రామ్ జెనీలియా జోడీ కి మంచి మార్కులు పడ్డాయి.
ఇదిలా ఉంటే మరో సారి… ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను రామ్ సినిమాతో పలకరించండి ఉన్నట్లు ఫిలిం వర్గాల లో టాక్ నడుస్తుంది. రామ్ త్వరలో ఒక బిగ్ ప్రాజెక్టు చేయనున్నట్లు ఆ సినిమాలో జెనిలియా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా సౌత్ ఇండియాలో అనేక భాషల్లో రిలీజ్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.