NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

George Soros: హిండెన్‌బర్గ్ నాథన్ ఆండర్సన్ కంటే తోపు షార్ట్ సెల్లర్ జార్జ్ సోరోస్…బ్లాక్ వెడ్నెస్డే 1992 ఇంగ్లాండ్ బ్యాంకు పతనం వెనుక సూత్రధారి జార్జ్ సోరోస్ అసలు కథ!

George Soros జార్జ్ సోరోస్
Share

George Soros: జార్జ్ సోరోస్ బ్రతికే ఉన్నాడా…బ్లాక్ వెడ్నెస్డే 1992 ఇంగ్లాండ్ బ్యాంకు పతనం వెనుక సూత్రధారి జార్జ్ సోరోస్ అసలు కథ!

అంతర్జాలం ఒక అద్భుతమైన చోటు, ఎప్పుడు ఎక్కడ ఎవ్వరిని మనకు గుర్తు చేస్తుందో అస్సలు ఊహించలేము. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు మల్లి జరిగింది. జార్జ్ సోరోస్ చనిపోయాడు అంటూ తప్పుడు వార్త (ఫేక్ న్యూస్) ఒకటి ఇంటర్నెట్ లో ప్రచారం అయింది. పాలిటిక్స్ ఫర్ ఐర్లాండ్ అనే ట్విట్టర్ యూసర్ చేసిన పోస్ట్ ఈ ఫేక్ న్యూస్ వెనుక ప్రధాన కారణం. అయితే 92 సంవత్సరాల వయస్కుడైన జార్జ్ సోరోస్ బతికే ఉన్నాడు…ఈ ఫేక్ న్యూస్ ధ్వారా జార్జ్ సోరోస్ జీవితం గురించి మాట్లాడుకునే అవకాశం మనకి దొరికింది. జార్జ్ సోరోస్ ఎవరు? ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంగ్లాండ్ బ్యాంకు ని ఒంటి చేత్తో దివాళా తీసేలా చేసిన బ్లాక్ వెడ్నెస్డే షార్ట్ సెల్లర్ ఈ జార్జ్ సోరోస్…

ఈ మధ్యకాలం లో ఇలాంటి ఫండ్ మేనేజర్ ఒకరు బాగా వార్తల్లో కనిపించాడు, అదానీ గ్రూవ్ కంపెనీ షేర్ల పతనం వెనుక మాస్టర్ మైండ్ నాథన్ ఆండర్సన్. జార్జ్ సోరోస్ లాగానే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఫౌండర్ నాథన్ ఆండర్సన్ షార్ట్ సెల్లర్ గా ప్రసిద్ధి తెచ్చుకున్నాడు. అయితే అదానీ గ్రూప్ కంపెనీల షార్ట్ సెల్ తో నాథన్ ఆండర్సన్ ఎంత సంపాదించుకున్నాడో మనకు లెక్కలు తెలియవు కానీ జార్జ్ సోరోస్ మాత్రం 1992 లో ఇంగ్లాండ్ బ్యాంకు కి చెందిన స్టెర్లింగ్ కరెన్సీ ని షార్ట్ చేసి మొత్తం మీద అక్షరాలా ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ లో 82,32,75,00,000 రూపాయలు సంపాదించుకున్నాడు జార్జ్ సోరోస్.

George Soros జార్జ్ సోరోస్
George Soros జార్జ్ సోరోస్

స్టాక్ మార్కెట్లలో షార్ట్ సెల్లింగ్ అంటే ఒక కంపెనీ షేర్లు త్వరలో పడిపోతాయి అని నమ్మకంతో ముందుగానే ఆ కంపెనీ షేర్లు అరువు తెచ్చుకొని ప్రస్తుతం ఉన్న ఎక్కువ ధరకు అమ్మడం. ఎప్పుడైనా అనుకున్నట్లు ఆ కంపెనీ షేర్ల ధర తగ్గిపోతుందో అప్పుడు తక్కువ ధరకు కొని అరువు తెచ్చుకున్న చోటనే తిరిగి ఇచ్చేయడం. ఇలా చేయడం వల్ల కంపెనీ షేర్లు పడిపోయినప్పుడు మీరు లాభాలు పోగుచేసుకోవొచ్చు. అధేవిధంగా కరెన్సీ ని కూడా షార్ట్ సెల్ చేసి కరెన్సీ మార్కెట్లో లాభాలు పొందావోచ్చు.

జార్జ్ సోరోస్ చేసింది, నాథన్ ఆండర్సన్ చేసింది ఇదే. హిండెన్‌బర్గ్ సంస్థ చేసింది అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను అయితే జార్జ్ సోరోస్ షార్ట్ సెల్ చేసింది మాత్రం ఏకంగా ఇంగ్లాండ్ కరెన్సీ అయిన పౌండ్ స్టెర్లింగ్. 1992 లో స్టెర్లింగ్ విలువ దారుణంగా పడిపోయి ఇంగ్లాడ్ ఆర్ధిక వ్యవస్థకే పెద్ద నష్టం తెచ్చింది, ఆ రోజును బ్లాక్ వెడ్నెస్డే అని పిలుచుకుంటారు. ఆలా అందరూ నష్టపోయిన సమయంలో ఒకరు మాత్రం ఉహలకందని లాభాలు చూసారు. బ్లాక్ వెడ్నెస్డే వలన జార్జ్ సోరోస్ కి మొత్తం సుమారు 83 వేల కోట్లు లాభం.

యురోపియన్ ఎక్స్చేంజి మెకానిజం అనే ఒక కొత్త కరెన్సీ నియమావళి లోకి పౌండ్ స్టెర్లింగ్ ని తెచ్చినప్పుడు ఆ మార్పు చాలా వేగంగా చేసారు. ఇంగ్లాండ్ ప్రభుత్వం తొందరపాటుతో పెద్ద ఆర్ధిక సంక్షోభాన్ని కొని తెచ్చుకున్నట్లు అయింది. దీనివలన పౌండ్ స్టెర్లింగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్ లో పడిపోవుతుంది అని ముందుగానే గ్రహించిన జార్జ్ సోరోస్ కొన్ని వేల కోట్లలో షార్ట్ సెల్లింగ్ చేసాడు. తాను అనుకున్నట్లు ఆ రోజు రానే వొచ్చింది, ఆ తరువాత జరిగిన బ్లాక్ వెడ్నెస్డే చెరిత్రలో నిలిచిపోయింది. ఇలా అందరూ నష్ట పోయిన సమయంలో లాభపడ్డాడు అని జార్జ్ సోరోస్ కి చాలా మంది విమర్శుకులు ఉన్నారు, అందుకేనేమో చాలా వరకు తన ఆస్థిని విరాళం ఇచ్చేసాడు జార్జ్ సోరోస్, మొత్తం 32 బిలియన్ అమెరికన్ డాలర్లు విరాళంగా ఇచ్చేసాడు. అంటే తాను బ్లాక్ వెడ్నెస్డే రోజు సంపాదించుకున్న దానికి 32 రేట్లు విరాళంగా ఇచ్చేసాడు.

 


Share

Related posts

కరోనా టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటున్నారా .. రేట్ తక్కువలో ఫిక్స్ చేశారు

sekhar

Man Eats Snake Video Viral: వీడు మామూలోడు కాదు ..పాము పిల్లనే కసాబిసా అనేశాడు..

bharani jella

అచ్చం టిక్ టాక్ యాప్ మాదిరిగా మరో యాప్ వచ్చేస్తోంది..!!

sekhar