కాఫీ తాగడం అంత మంచిది కాదు.. అని అంటుంటారు చాలా మంది. కానీ ఆ మాట .. బ్లాక్ కాఫీ విషయం లో వర్తించదు . ఎందుకంటే సాధారణ కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయని తాజా పరిశోధనల్లో తెలిసింది. దీని పై పరిశోధనలు చేస్తున్న వారు కూడా ఈ విషయాన్ని చాల బలం గా ద్రువీకరిస్తున్నారు.
2 కప్పుల బ్లాక్ కాఫీ రోజు తాగితే లివర్ ఆరోగ్యం చాల బాగుంటుందట.. సిర్రోసిస్ అనే వ్యాధి కూడా 80శాతం వరకు తగ్గుతుందని తెలియ చేస్తున్నారు. జ్ఞాపకశక్తి పెరిగి బరువు తగ్గేందుకు, మరియు కడుపుని శుభ్రం చేయడానికి, గుండె ఆరోగ్యం గా ఉండడానికి ఇది ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధనల్లో తెలిసింది. బ్లాక్ కాఫీ లో యాంటియాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందు లోని మాంగనీస్, విటమిన్ బీ2, బీ3, బీ5, పొటాషియం, మెగ్నీషియం ఆరోగ్యానికి రక్షణ ఇస్తాయి.
చక్కర లేకుండా బ్లాక్ కాఫీతాగడం వలన మానసికంగా, శారీరకంగాఉత్సహం గా ఉండేందుకు ఉపయోగపడతాయి. బ్లాక్ కాఫీ వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా దాచేందుకు బాగా ఉపయోగ పడుతుంది.మరీ ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వారికి బ్లాక్ కాఫీ మంచి ఔషధం లా పని చేస్తుంది. ఎందుకంటే రక్తం లో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
ఎప్పుడు బద్ధకం గా ఉండేవారికి కూడా బ్లాక్ కాఫీ చాలా మేలు చేస్తుంది. ఎలా అంటే కాఫీ తాగడం వల్ల వాకింగ్ చేసినంత ప్రయోజనాలని పొందుతామని తెలిసింది.అలాగే క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పించడం తో పాటు ..మానసిక ఒత్తిడి, అలసటను పోగొట్టి రోజంతా ఉత్సహం గా ఉండేందుకు ఒకటి లేదా రెండు కప్పు ల బ్లాక్ కాఫీ తాగవలిసిందే. కాబట్టి మీరు కూడా ప్రయత్నించి చూడండి మరి…