తమన్నా ఫాన్స్ రెడీ అయిపోండి .. మీకు ఇక మంచిరోజులు వచ్చేశాయ్..!

గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ కి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఇద్దరు ఈ సినిమాలో కబడ్డీ కోచ్ లు గా నటిస్తున్నారు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ నిలిచిన సంగతి తెలిసిందే. తిరిగి మళ్ళీ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందట.

Seetimaar Movie Official Teaser Update | Gopichand | Thamannaah |  #Gopichand28 | Tollywood Adda - YouTube

అలాగే తమన్నా రీసెంట్ గా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించబోతున్న బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ లో హిందీలో టబు పోషించిన పాత్రలో తమన్నా నటించబోతుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తోంది. అలాగే తమన్నా మరో టాక్ షో కి మొదటిసారి హోస్ట్ గా వ్యవహరించబోతుంది.

अंधाधुन` के तेलुगु रीमेक में तब्बू की जगह तमन्ना और आयुष्मान की जगह नजर  आएंगे नितिन

తమన్నా లాక్ డౌన్ తర్వాత మళ్ళీ తిరిగి షూట్ లో పాల్గొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని యాడ్ ఫిల్మ్‌ ల షూటింగ్‌ లో ఉంది. అలాగే త్వరలో సీటిమార్ సినిమా షూటింగ్‌ లో కూడా పాల్గొననుందని సమాచారం. ప్రస్తుతం ఓటీటీల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న నేపథ్యంలో అల్లు అర‌వింద్‌ అహా కోసం త‌మ‌న్నాతో ఓ టాక్ షోను ప్లాన్ చేయబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ టాక్ షో షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అంతేకాదు సినిమా సెలబ్రిటీస్ తో రెడీ అవుతున్న ఈ టాక్ షో విజయ దశమి పండుగ సందర్భంగా స్ట్రీమింగ్ కాబోతుంది.