ఈ బిజీ జీవితం లో తెల్లారింది మొదలు పడుకునే వరకూ ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి .వాటికి తోడు ఇళ్లల్లో దోమలు, ఈగలు, ఎలుకలు బొద్దింకలు కూడా సమస్య గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ బొద్దింకల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది.లేదంటే అవి ఆస్తమా, అలర్జీ వ్యాధుల్ని కలిగిస్తాయి.అందువల్ల బొద్దింకలు రాకుండానే చూసుకోవాలి. ఇందుకోసం మొదటగా చేయవలిసింది వంటింటిని శుభ్రంగా ఉంచుకోవడం.
ఎప్పటికప్పుడు పాత్రలు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. తినే పదార్థాలు వంటింట్లో కింద పడకుండా జాగ్రత్త పడాలి.వంటగదిలో పాత్రల్ని ఎప్పటికప్పుడు ప్లేస్ మారుస్తూ ఉండాలి. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తో బొద్దింకలను అరికట్టవచ్చు .
చాలా ఇళ్లలో వంటిల్లు బాగా కనిపించాలనే ఉద్దేశ్యంతో పసుపు రంగు ఉండేలా పెయింట్ చేస్తారు. మిగతా రంగుల కంటే ఈ పసుపు రంగు బాగా మెరుస్తుంది. అందువల్ల ఈ రంగు వంటగదిలో అదనపు కాంతిని ఇస్తుంది. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. పసుపు రంగు అంటే బొద్దింకలకు మహా ఇష్టం. నిజానికి అవి మనుషుల్లాగా అన్ని రకాల రంగుల ని చూడలేవు. వాటికి పసుపు రంగు కనిపించదు. కానీ వాటి కళ్ల కు పసుపు రంగు నలుపు రంగులో కనిపిస్తుంది. అందువల్ల పసుపు రంగు ఎక్కడ ఉంటే అక్కడ కు బొద్దింకలు చేరిపోతాయి .
చీకట్లో దాక్కున్నామనే భావనతో తో అక్కడ నివాసం ఏర్పరుచుకుంటాయి. అందువల్ల ఇంట్లో, వంటగదిలో పసుపు రంగు లేకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు బొద్దింకలని చంపడానికి రకరకాల రసాయనాలు అమ్ముతున్నారు. అవి అప్పటికి అప్పుడు పనిచేస్తాయే తప్ప పూర్తిగా సమస్య ను తొలగించవు . పైగా ఈ రసాయనాల వాసనలు మన ఆరోగ్యాన్నీ పాడుచేస్తాయి. అందువల్ల సహజసిద్ధంగా బొద్దింకల్ని వదిలించుకోవాలి.
దోసకాయ ముక్కల్ని బొద్దింకలు వచ్చే చోటపెట్టాలి. ఎందుకంటే వాటికి ఆ వాసన అస్సలు నచ్చదు .
బొద్దింకలకు మరొక శత్రువు బోరిక్ పౌడర్. ఆ పౌడర్ బొద్దింకలకు ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.
సబ్బు కలిపిన నీటిని ను బొద్దింకల పై పిచికారి చేస్తే అవి పోతాయి.
మొక్కజొన్న పిండి,బోరిక్ యాసిడ్, షుగర్ పౌడర్, ని సమాన పరిమాణంలో కలిపి బొద్దింకలు వచ్చే చోట పెడితే దాన్ని తిని అవి చనిపోతాయి. ఈ సహజమైన పద్ధతులు మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి.