Ghani: అందరూ అనుకున్నదే జరిగింది. గత ఏడాది నుంచి సినిమాలన్నీ షూటింగ్స్ పూర్తికాక రిలీజ్ రీ షెడ్యూల్ చేసుకున్నారు. అయినా కొన్ని సినిమాలు మళ్ళీ రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. డిసెంబర్ నెలలో చాలా సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ లాక్ చేసుకున్నారు. వాటిలో ఈ నెల 2న బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన అఖండ సినిమా వచ్చి భారీ కమర్షియల్ హిట్ సాధించింది. దాంతో మిగతా చిత్ర దర్శక నిర్మాతలకు మంచి ఉత్సాహం వచ్చింది. అయితే ఈ నెలలో భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందిన పుష్ప రిలీజ్ కాబోతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్‌లో నర్తించబోతుంది. సుకుమార్ దర్శకుడు. పుష్ప ది రైజ్ పార్ట్ 1 పేరుతో డిసెంబర్ 17న ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజైన వారానికి నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజ్ కానుంది. అయితే డిసెంబర్ 3న రిలీజ్ కావాల్సిన గని సినిమా అఖండ సినిమా కారణంగా పోస్ట్‌పోన్ చేస్తూ డిసెంబర్ 24న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో నాని శ్యామ్ సింగ రాయ్ వరుణ్ తేజ్ గని చిత్రాల మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు.
Ghani: ఏమాత్రం కథ బావున్నా నానికి శ్యామ్ సింగ రాయ్ సినిమాతో భారీ హిట్ దక్కుతుంది.
అసలే గత కొంతకాలంగా నానికి సరైన హిట్ లేదు. ఇలాంటి సమయంలో సోలో రిలీజ్ అనుకున్న సినిమాకు గని పోటీ రావడం కొంత నిరాశను కలిగించింది. కానీ తాజాగా గని మేకర్స్ నానికి సైడ్ ఇచ్చి సపోర్ట్ చేశారు. ఈ సినిమాను ఇప్పుడున్న ఠఫ్ కాంపిటీషన్స్ మధ్య రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనే భావనతో మా గని సినిమాను పోస్ట్‌పోన్ చేస్తూ త్వరలో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని అధికారికంగా వెల్లడిస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. గని మేకర్స్ తీసుకున్న నిర్ణయంతో నాని చిత్ర నిర్మాతలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఏమాత్రం కథ బావున్నా నానికి శ్యామ్ సింగ రాయ్ సినిమాతో భారీ హిట్ దక్కుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?