Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ సినిమా “గని” రిలీజ్ కు రెడీ అయిన సంగతి తెలిసినదే. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ శుక్రవారం అనగా ఏప్రిల్ 8న విడుదల కాబోతోంది. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇక ‘ఎఫ్ 2’ ‘గద్దలకొండ గణేష్’ వంటి వరుస హిట్స్ తో మంచి జోష్ లో ఉన్న వరుణ్.. ”గని” సినిమాతో హ్యాటిక్ సక్సెస్ అందుకుంటారని ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
Varun Tej : వరుణ్ ఈ సినిమాకోసం ఎంత కష్టపడ్డాడంటే?
అవును.. ఈ స్పోర్ట్స్ డ్రామా కోసం మెగా వారసుడు చాలా కష్టపడ్డారు. ఫ్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి కఠినమైన వర్కౌట్స్ చేసి ఆరు పలకల బాడీని రెడీ చేశారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ‘గని’ చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు పతాకస్థాయిలో అరేంజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామందికి ఓ డౌట్ క్రియేట్ అయ్యింది. హీరో వరుణ్ తేజ్ కు మీడియా ఇంటరాక్షన్ లో ఓ రకమైన ఇబ్బందికర ప్రశ్నలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని అంతా అనుకుంటున్నారు.
ఏమిటా ఇబ్బంది?
అందరికీ తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోని పబ్ రైడ్ సంఘటనలో నిహారిక పేరు బయటకు వచ్చింది. తెల్లవారుజామున 2.30 గంటల వరకూ నిర్వహించబడుతున్న ఫుడింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయగా.. అందులో పాల్గొన్న 140 మందిలో నిహారిక కూడా ఉండటం కొసమెరుపు. అయితే అక్కడ ఆమె ఏ తప్పు చేయలేదని పోలీసులు సైతం మీడియాతో చెప్పిన దాఖలాలు ఉన్నప్పటికీ ఈ జర్నలిస్టులు మాత్రం ఈ విషయాన్ని మర్చిపోవడం లేదు. సందు దొరికినప్పుడల్లా ఆ ఇంటి సభ్యులు దగ్గర పదేపదే ఈ విషయం గురించే అడుగుతున్నారు.