కారు” మబ్బుల్లోకి… “కమలం” కొలనులోకి!! : స్పష్టంగా ప్రభుత్వ విఫల్యం

 

తెరాస కు 2016 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 99 స్థానాలు వస్తే, ఇప్పుడు కేవలం 56 స్థానాలు వచ్చాయి. 43 స్థానాలు తగ్గాయి. దీన్నే ప్రభుత్వ వైఫల్యం అనేద్దామా?? మేయర్ పీఠం ఏర్పాటుకు తెరాస మంచి సీట్లు సాధించింది కదా? అందరికన్నా అతిపెద్ద పార్టీగా అవతరించింది కదా? ఇంకా ఏమిటి వైఫల్యం? ఎందుకు దీన్ని తెరాస ప్రభుత్వ వ్యతిరేక తీర్పు అనుకోవాలి? అంటే కచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యం వ్యతిరేక తీర్పే అని ఘంటాపథంగా చెప్పొచ్చు… ఎందుకంటే…

ప్రభుత్వంలో కీలకం అయ్యేవారు మంత్రులే. మంత్రులు సాధారణ ప్రజాప్రతినిధులకు భిన్నంగా పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్రమంతా ఒక యూనిట్ గా వారు కార్యకలాపాలు నిర్వహిస్తారు. మీరు ప్రభుత్వానికి వారధిగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అలాంటి వారి బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు ఇచ్చిన బాధ్యతలు పూర్తిగా విఫలం అయినట్లే కనిపిస్తోంది. వారిని ప్రజలు అంత విశ్వసిస్తున్నట్లు కనిపించలేదు. గ్రేటర్ ఫలితాల్లో అధికార తెరాసకు కనిపించిన అనుభవాలు ఇవే చెబుతున్నాయి. తెరాస ప్రభుత్వానికి ప్రజలు కట్టుబడి లేరని ప్రభుత్వ వైఫల్యం తో పాటు వ్యతిరేకత ఎక్కువగా పెరుగుతోందని మంత్రులు ఇన్చార్జిలుగా ఉన్న నియోజకవర్గాలు, వారి సొంత నియోజకవర్గాల్లోని తెరాసకు రమారమి సీట్లు రావడం ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యం గానే కనిపిస్తోందని, ఇది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో స్పష్టమైందని రాజకీయ విశ్లేషకుల మాట.

ఎక్కడెక్కడ అంటే

*ఎమ్మెల్సీ కవిత ఇంచార్జి గా ఉన్న గాంధీ నగర్ లో టీఆరెస్ ఓటమి..

*మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జి గా ఉన్న అడిక్ మెట్ లో టీఆరెస్ ఓటమి..

*మంత్రి సబితా ఇంచార్జి గా ఉన్న ఆర్కే పురం లో టీఆరెస్ ఓటమి..

*హబ్సి గూడ టీఆరెస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య ఓటమి..

*మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న రామ్ నగర్ లో టీఆరెస్ అభ్యర్థి నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఓటమి..

*మంత్రి తలసాని ఇంచార్జ్ గా ఉన్న ముషీరాబాద్ లోని 3 చోట్ల ఓటమి..

*మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న సరూర్ నగర్ లో టీఆరెస్ ఓటమి.

*విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గం లోని రెండు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

* పశుసంవర్ధక సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ నియోజకవర్గంలో 6 స్థానాల్లో అధికారపార్టీకు దక్కినవి 3 మాత్రమే.

*అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి తెరాస ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఐదు స్థానాలు ఉంటే అధికారపార్టీకి దక్కినవి రెండే.

* జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో తెరాస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ ఉన్న 5 ఎట్ల లో అధికార పార్టీ గెలిచింది మూడే.
* ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార టీఆర్ఎస్ లోకి వచ్చిన దేవిరెడ్డి సుధీర్రెడ్డి స్థానంలో ఉన్న 11 సీట్లను బీజేపీ గెలుచుకుంది.
మొత్తంగా చూస్తే ఫలితాలను విశ్లేషిస్తే అధికార పార్టీని ప్రజలు తిరస్కరించినట్లు కనిపిస్తోంది. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్చార్జిలుగా ఉన్న అన్ని స్థానాల్లోనూ టిఆర్ఎస్ కు మెరుగైన ఫలితాలు ఏమి రాలేదు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత అని తెలుస్తోంది. గంగా ఈ ఫలితాల్లో కారు గుంతల రోడ్ లోకి వెళ్తే… కమలం కొలను లోకి వెళ్లి వికసించినట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.