NewsOrbit
న్యూస్

పోలింగ్ ఎంతైనా రూలింగ్ మాదే అంటోన్న ప్రధాన పోటీదారులు! ఎవరి లెక్కలు వారివి!

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఆశించినంత నమోదు కాకపోవడంతో రాజకీయ పార్టీలు ఖంగుతిన్నాయి. ఓటు వేసేందుకు ఓటర్లు ఎందుకు ఉత్సాహం చూపలేదని, ఎక్కడ సమస్య వచ్చిందని పోలింగ్ అనంతరం పోస్టుమార్టం మొదలెట్టాయి. అయితే ఓటింగ్​ శాతం ఎంత అయినప్పటికీ తమకే లాభం అని ప్రధాన పోటీదారులైన టీఆర్ఎస్ లీడర్లు,బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. చెప్పుకోదగ్గ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్, ఉన్న సీట్లను నిలబెట్టుకుంటామని ఎంఐఎం ధీమాగా ఉన్నాయిఅధికార టీఆర్ఎస్ వాదన ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఓటింగ్​కు వచ్చారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.

ghmc elections latest updates
ghmc elections latest updates

ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు ఓటింగ్​లో పాల్గొన్నారని, తక్కువ ఓటింగ్​ నమోదైనా తమకు కలిసి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డబుల్  ఇండ్ల లబ్ధిదారులను గుర్తించామని, వారంతా పోలింగ్ కు వచ్చారని చెప్తున్నారు. అయితే.. గ్రేటర్  పరిధిలో ప్రతి నెల 10 లక్షలు మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు.వీరంతా ఓటింగ్​కు రాలేదని టీఆర్​ఎస్​ పెద్దలు లోలోన మదన పడుతున్నారు. ఫ్రీ వాటర్ స్కీమ్, పన్ను రాయితీ ప్రకటన వర్కవుట్ అయిందా? ఒకవేళ ప్రజలు ఆ హామీలకు ఆకర్షితులైతే పెద్ద ఎత్తున పోలింగ్​లో ఎందుకు పాల్గొనలేదని కూడా గులాబీ నేతలు చర్చించుకుంటున్నారు. అనుకున్నంతగా లబ్ధిదారులు ఓటింగ్​లో పాల్గొనకపోయినా.. నమోదైన పోలింగు​లో  పాల్గొన్నది లబ్ధిదారులేనని, అది కలిసి వస్తుందని టీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే వరద బాధితుల ఆగ్రహం తమ పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు వేస్తున్నారు .

ghmc elections latest updates
ghmc elections latest updates

నెలన్నర కింద వచ్చిన వరదలతో హైదరాబాద్​లోని బస్తీలు చాలా వరకు నీట మునిగాయి. ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదన్న ఆగ్రహం బస్తీవాసుల్లో ఉంది. అయితే.. వరద సాయం ఈ ఎన్నికల్లో తమకు ప్లస్​ అవుతుందని టీఆర్​ఎస్​ భావిస్తోంది. కానీ, వరద సాయం విషయంలో తలెత్తిన వివాదాలు, టీఆర్​ఎస్​ లీడర్లే పంచుకు తిన్నారన్న ఆరోపణలు ఎలక్షన్లలో ప్రభావం చూపుతాయని బీజేపీ లీడర్లు అంచనా వేస్తున్నారు.ప్రచారంలో కూడా టీఆర్​ఎస్​ లీడర్లను బస్తీల్లోని వరద బాధితులు నిలదీసిన సంఘటనలు వారు గుర్తుచేస్తున్నారు. ఇదే బీజేపీకి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ తగ్గుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదట్నించి ప్లాన్ వేసిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ఇవ్వడంతో చాలా మంది ఓటర్లను ఊర్లకు వెళ్లేలా చేశారని వారు అంటున్నారు. అయితే ప్రభుత్వ విధానాలపై విసిగిపోయిన ప్రజలు పోలింగ్​లో పాల్గొన్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ తమకు అనుకూలమని బీజేపీ లీడర్లు అంచనా వేస్తున్నారు.తమ పార్టీ పరిస్థితి మెరుగైందని కాంగ్రెస్ చెబుతుండగా పాత సీట్లన్నింటినీ నిలబెట్టుకుంటామని మజ్లిస్ ప్రకటిస్తోంది.ఈ లెక్కలన్నీ తేలడానికి ఇంకోరోజు వేచి చూడాలి.

author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju