NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రామ్ ఇంట్లో రహీమ్ పాగా : జీహెచ్ఎంసి ఎన్నికల్లో కొత్త వ్యూహాలు బయటకు

మజ్లిస్ ఎ ఇత్తెహాద ముస్లిమీన్.. (ఎంఐఎం)… పేరులోనే ముస్లింల స్వతంత్ర రాజ్య కాంక్షను వెలిబుచ్చే హైదరాబాద్ పార్టీ… మజ్లీస్ పార్టీ గా చెబితే చాలామంది అర్థమవుతుంది. దీనికి వేదిక హైదరాబాద్ పాతబస్తీ. అర్థమైంది కదా ఓవైసీ బ్రదర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ముస్లిం పార్టీ. ఇది హైదరాబాద్ లో ఎప్పుడూ తన స్థానాన్ని వదులుకునే ప్రసక్తే ఉండదు. గత ఎన్నికల్లో 44 స్థానాలు వస్తే, ఇప్పుడు కూడా 44 స్థానాలు సంపాదించింది. గొప్పదనం ఏంటంటే ఎంఐఎం మొత్తం 51 స్థానాలకు పోటీ చేస్తే కేవలం ఓడిపోయింది ఏడు స్థానాలు… అంటే గెలుపు శాతం 92 పెర్సెంట్. మజ్లిస్ పార్టీ హైదరాబాదులో ఉన్న 150 రెండు స్థానాల్లోనూ తన అభ్యర్థుల నిలిపే సత్తా ఉన్న పార్టీ. అయితే దాన్ని, ఓవైసీ సోదరులు ఒప్పుకోరు. అమ్మ బలం ఉన్న చోట, ముస్లిం ఆధిక్యత ఉన్న చోట మాత్రమే వారు పోటీ చేస్తారు. అక్కడ కచ్చితంగా విజయం సాధిస్తారు. ఎంఐఎం పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రణాళికలు వేసుకుంటున్న సమయంలో అసలు హైదరాబాద్ ఎన్నికల్లో వారి గెలుపు ఎలా సాధ్యమవుతుంది?? కేవలం ముస్లింలు మాత్రమే ఎంఐఎం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నార?? హిందువులు ఈ పార్టీలో అసలు లేరా?? హిందూ ఓట్లను ఎంఐఎం పార్టీ పొందగలుగుతుంద??, అనే అనేక సందేహాలను తీర్చేందుకే ఈ కాలం…. (ఒకసారి చదవండి)

మూసి దాటాని రాజకీయాలు

మజ్లిస్ పార్టీ ను ఢీ కొట్టాలంటే మూసీ నది దాటి వెళ్ళాలి పాతబస్తీలో చొచ్చుకు వెళ్ళాలి. ఇక్కడే మన రాజకీయ పార్టీల మధ్య భయం నెలకొంటుంది.

ఒకటి పోయి ఒకటి వచ్చే

మజ్లీస్ పార్టీ 2016 లో గెలుచుకున్న 44 స్థానాలకు ఇప్పుడు అది సంఖ్య తగ్గట్టుగా 44 స్థానాలు గెలుచుకుంది అంటారు. అయితే మజ్లిస్ పార్టీ 2016 లో గెలిచిన జాంబాగ్ స్థానాన్ని ఈ సారి ఓడిపోయింది. అయితే గతంలో ఓటమి చవి చుసిన కాన్సీ బజార్ స్థానాన్ని గెలుపొంది తన ఖాతాలో వేసుకుంది. దీంతో లెక్క సరిపోయింది.
** ఎంఐఎం అంటే కేవలం హైదరాబాద్ పాతబస్తీ కే పరిమితమైన పార్టీ అని కేవలం ముస్లింలకు సంబంధించిన పార్టీ అని ఉన్న అపోహ ఈ ఎన్నికల్లో తొలగిపోయింది. పాతబస్తీ ఆవల వున్న 7 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. ముషీరాబాద్ లో ఉన్న ఎర్రగడ్డ, బోలక్ పూర్, దత్తాత్రేయ నగర్, సనత్ నగర్, నాంపల్లి లో 3 సీట్లు హిందూ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు. ఇక్కడ మజ్లీస్ పార్టీ విజయం సాధించింది. అంటే అత్యధికంగా ఉన్న హిందువులు మజ్లీస్ కు ఓటు వేశారు. దీన్ని మనం సునిశితంగా గమనించాలి.

ఎందుకు వేస్తున్నారు??

హిందువులలో ఉన్న 6 నుంచి 8 శాతం ఓటర్లు ఎంఐఎంకు ఓటేసి ఉన్నట్లు సర్వేలో తేలింది. ఎంఐఎంకు ఓటస్తున్న హిందూ ఓటర్లలో ఎక్కువ శాతం ఉన్నది దళిత ఓటర్లే అని తేలింది.
** పాతబస్తీలో లేదా హైదరాబాద్ నగరంలో ఉన్న వివాద స్థలాలు ఇతర అంశాల నేపథ్యంలో ఎక్కువ మంది ఎంఐఎం తో జతకడుతున్న ట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ కు సంబంధం లేకుండా ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఎన్నికల వేళ ఎంఐఎం మద్దతు తెలుపుతూ వారికి అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
** రెండో విషయానికి వస్తే ఎంఐఎం తెలివిగా వ్యవహరిస్తోంది. హిందూ ఓటర్లను కొల్లగొట్టేందుకు కొత్త వ్యూహ రచనలు చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఆయా సామాజిక వర్గాల ప్రాబల్యాన్ని అంచనా వేస్తూ మజిలీ తరఫున హిందూ అభ్యర్థులను రంగంలోకి దింపుతుంది.
*ఉదాహరణకు జంగం మెట్ లో ఎంఐఎం గెలిచింది. ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి తారాబాయి. లంబాడి వర్గానికి చెందిన తారాబాయి ఓట్లు ఇక్కడ ఎక్కువ. జంగం మెట్ పరిధిలో నాయక్ నగర్ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది లంబాడీలు. మీరు ఇక్కడ నాలుగు వేల మంది వరకు ఉంటారు. అంటే మీరు ఓట్లు రమారమి ఐదు వేల పైనే. జంగం మెట్ లో ఇటు లంబాడి ఓట్లే కాదు దళితుల ఓట్లు.. సంప్రదాయ ముస్లిం ఓట్లు ఎంఐఎం కు పడ్డాయి.
** పురాణాపూల్ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా సున్నం రాజమోహన్ గత రెండు పర్యాయాలు ఎంఐఎం నుంచి గెలిచారు. ఈయన పక్కా హిందువు. ఈయన మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు. హుస్సేనీ ఆలం లో ఎక్కువగా ఉండేది రాజస్థానీయులు. ఆ తర్వాత దళితులు మున్నూరు కాపులు ఎక్కువ. అలాగే అన్ని వర్గాలకు చెందిన వారు ఇక్కడ కనిపిస్తారు. కార్బన్ నుంచి మరో హిందూ అభ్యర్థి స్వామి యాదవ్ ఎంఐఎం నిలబెట్టింది. కార్వాన్ లో ముస్లింలు ఎక్కువగా ఉన్న యాదవుల ఓట్లు అధికం. దీన్ని ఎంఐఎం అందిపుచ్చుకుంది. కార్వాన్ లో ఎప్పుడూ లేనట్లుగా హిందూ అభ్యర్థిని రంగంలోకి దింపింది. తన స్థానాన్ని గెలుచుకుంది. ఈ మూడు చోట్ల హిందూ అభ్యర్ధులను నిలబెట్టడం ఎంఐఎం వ్యూహం. ఇక్కడ హిందూ అభ్యర్థులను ఇతర పార్టీలు నిలబెట్టిన అంత ప్రయోజనం ఉండదు. ఇక్కడ ఆయా సామాజిక వర్గాల కోట్లతో పాటు సంప్రదాయ దళితుల ఓట్లు ముస్లిం ఓట్లు గుంప గుత్తుగా పడుతున్నాయి. దీన్ని ఆ పార్టీ చక్కగా అందిపుచ్చుకుంది.
** పాతబస్తీలో వ్యాపారం చేసుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి ముఖ్యంగా మహబూబ్నగర్ ప్రాంతం నుంచి ఎక్కువ మంది హిందువులు ఇక్కడ లబ్ది పొందుతున్నారు. ఎన్నో ఒడిదుడుకులు కూర్చు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరంతా ఖచ్చితంగా స్థానిక నాయకులు ఎవరైతే తమ వ్యాపారాలకు అనువుగా ఉంటారో వారు చెప్పిన పార్టీకి ఓటు వేస్తారు. అలా కొన్ని వందల ఓట్లు ఎంఐఎం సాధిస్తోంది.
** ఎంఐఎం గెలుపు వాహనంలో మరో ముఖ్యమైనది.. హిందూ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం ప్రతినిధులు మొదట కొందరు హిందూ అభ్యర్థులను రంగంలోకి దింపుతారు. ఇండిపెండెంట్ గా నిలబడే వీరంతా ఎక్కువగా ప్రచారం చేసుకుంటారు. అయితే చివరకు వచ్చేసరికి మాత్రం వీరంతా ఎంఐఎం తరఫున పనిచేస్తారు.
** ఎంఐఎం పార్టీకి ఓట్ వేయాలని ప్రతి ఎన్నికల ముందు మత పెద్దలు ఆదేశం, (ఫత్వ) జారీ చేస్తారు. దీనిని ఎవరు తప్పరు. తప్పితే కఠిన శిక్ష ఉంటుంది. దీంతో ముస్లిం కమ్యూనిటీలో ఓట్లు ఏవి ఇతర పార్టీలకు పడవు.
ఎంఐఎం పార్టీ విషయాలు వెనుక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి… అలాగే ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో ఉండిపోవడం వెనుక… ఇంకా అనేక కారణాలు ఉన్నాయి.

author avatar
Special Bureau

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N