NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

GHMC: కరోనా మృతుల అంత్యక్రియల రేట్లు ఫిక్స్ చేసిన జీహెచ్ఎంసీ! జంట నగరాల వాసులకు ఇది ఊరటే!!

GHMC: జంటనగరాల్లోని శ్మశాన వాటికల వద్ద జరుగుతున్న దోపిడీకి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అడ్డుకట్ట వేసింది.ఈ శ్మశానవాటికల్లో వసూలు చేయాల్సిన నిర్ణీత మొత్తాలను జీహెచ్ఎంసీ నిర్ణయించింది.ఇంతే వసూలు చేయాలంటూ కూడా శ్మశానవాటికల వద్ద రేట్ల పట్టికలను సైతం అంటించింది.ఇది నిజంగా జంటనగరాల ప్రజలకు చాలా ఊరటనిచ్చే నిర్ణయమేనని చెప్పవచ్చు.

GHMC fixes corona dead funeral rates!
GHMC fixes corona dead funeral rates

ఇప్పటివరకూ జరిగింది ఇది!

కరోనా తొలి వేవ్ సందర్భంగా గత ఏడాది మృతుల అంత్యక్రియలు బాధ్యతలను జీహెచ్ఎంసీ నిర్వహించింది.అయితే సెకండ్ వేవ్ లో మాత్రం జీహెచ్ఎంసీ ఈ విషయాన్ని పట్టించుకోలేదు.దీంతో శ్మశాన వాటికల వద్ద దోపిడీ మొదలైంది. కరోనా రోగుల మృతదేహాలకు అంత్యక్రియలకైతే అరలక్ష వసూలు చేస్తున్న శ్మశాన వాటికలు కూడా ఉన్నాయి. అంబులెన్సుల నిర్వాహకులే ఈ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసి కరోనా మృతుల కుటుంబసభ్యుల నుండి వేలల్లో డబ్బులు దండుకుంటున్నారు.ఆస్పత్రిలో చికిత్సకు అయ్యే వ్యయం ఒక ఎత్తైతే అంత్యక్రియలకు ఖర్చులు పెట్టాల్సిన మొత్తాన్ని చూసి కరోనా మృతుల కుటుంబసభ్యులు గుండెలు బాదుకుంటున్న పరిస్థితి జంటనగరాల్లో నెలకొంది.ఇదే విషయమై మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తుండటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది.మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ దీనిపై స్పందించారు.జీహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ అధికారులతో ఆయన శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విషయాలు చర్చించి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండేలా అంత్యక్రియల రేట్లను ఫిక్స్ చేశారు.

GHMC: ఇకపై వసూలుచేసే ఫిక్సెడ్ రేట్లు ఇవీ

ఇకపై ఏ స్మశానవాటికలో కూడా కరోనా వ్యాధితో మృతి చెందిన రోగుల మృతదేహాల అంత్యక్రియలకు ఎనిమిది వేల రూపాయల వరకు మించి వసూలు చేయరాదని అధికారులు నిర్ణయించారు.కరోనా కాకుండా ఇతర వ్యాధులతో మరణిస్తే వారి మృతదేహాల అంత్యక్రియల నిమిత్తం ఆరు వేల రూపాయలు మాత్రమే వసూలు చేయాలి.కరోనా మృతదేహాలను ఎలక్ట్రికల్ యంత్రంలో దగ్ధం చేసేందుకు నాలుగు వేల రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది.కరోనా రోగి మృతదేహాన్ని ఎలక్ట్రికల్ మిషన్పై దహనం చేస్తే అందుకు నాలుగువేల రూపాయలు మాత్రమే తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు జంట నగరాల్లోని అన్ని శ్మశాన వాటికలలో సోమవారం నుండి ఇవేరేట్లు అమల్లో ఉంటాయని ఏ ఒక్కరు వీటిని ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించడమే కాకుండా ప్రజలందరికీ ఈ సమాచారం తెలిసేలా అన్ని శ్మశానవాటికల్లో రేట్ల పట్టికలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇది ఎంతవరకు ఆచరణలో అమలు అవుతుందో చూడాలి!

author avatar
Yandamuri

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju