జీహెచ్ఎంసీ అప్‌డేట్స్…మేయర్ స్థానానికి చేరువలో టీఆర్ఎస్

 

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. మొత్తం 150 డివిజన్‌లకు గానూ 111 డివిజన్‌లలో ఇప్పటి వరకూ స్పష్టత వచ్చింది. గత ఎన్నికల కంటే టిఆర్ఎస్‌కు స్థానాలు తగ్గుతున్నప్పటికిీ మేయర్ స్థానం కైవశం చేసుకునే మెజార్టీ వచ్చే పరిస్థితి ఉన్నది.  ఇప్పటి వరకూ టీఆర్ఎస్ 43, బీజెపీ 28, ఎంఐఎం 38, కాంగ్రెస్ రెండు డివిజన్‌లు కైవసం చేసుకున్నాయి. ఇంకా 39 డివిజన్‌లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

హోరాహోరీగా సాగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజెపీ బాగా పుంజుకోవడం పట్ల ఆ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంతో మంచి జోష్‌లో ఉన్న బీజెపీకి గ్రేటర్‌లోనూ అధికార పార్టీకి ధీటుగా నిలబడటం రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావంతో ఉన్నారు.